Ramachandra Reddy : అమరావతి : ఏపీ కూటమి సర్కార్ పీపీపీ మోడల్ పేరుతో ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు ప్లాన్ చేస్తోందని, దీనిని అడ్డుకుని తీరుతామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తూ పుంగనూరు బస్ స్టాండ్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహం నుండి మండల కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తాసిల్దార్ కి వినతిపత్రం అందజేశారు ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Ramachandra Reddy) .ఈ సందర్బంగా మాజీ మంత్రి మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి పాలన గాడి తప్పిందన్నారు. కేవలం ప్రచారం తప్పా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు.
Ex Minister Ramachandra Reddy Key Comments
నిత్యం సీఎం చంద్రబాబు నాయుడు పెట్టుబడిదారుల జపం చేస్తున్నారని, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పట్టించు కోవడం లేదన్నారు మాజీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని హెచ్చరించారు. తమ నాయకుడు జగన్ రెడ్డి పాలనా కాలంలో విద్యా , వైద్య రంగానికి ప్రయారిటీ ఇచ్చారని అన్నారు. ఇదే సమయంలో వ్యవసాయ రంగంలో కీలక మార్పులు తీసుకు వచ్చారని , ఆర్బీకే సెంటర్లను ఏర్పాటు చేశారన్నారు. కానీ చంద్రబాబు నాయుడు వచ్చాక వాటిని పక్కన పెట్టారని ఆరోపించారు. ఇవాళ విద్య, వైద్యం పేదలు, సామాన్యులకు అందని ద్రాక్ష పండుగా మారిందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తామంటే చూస్తూ ఊరుకోమని సీఎంకు వార్నింగ్ ఇచ్చారు రామచంద్రా రెడ్డి.
Also Read : CII Important Summit in AP : సీఐఐ సమ్మిట్ భద్రతా ఏర్పాట్లపై మంత్రి సమీక్ష
















