Harish Rao : హైదరాబాద్ : మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు (Harish Rao) కీలక వ్యాఖ్యలు చేశారు. నిధుల లేమితో గురుకులాలు ఇబ్బందులు పడుతుంటే చాలీ చాలని నిధులు విడుదల చేయడం దారుణమన్నారు. సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. గురుకులాకు గ్రీన్ ఛానెల్ లో నిధులు విడుదల చేస్తామన్న ముఖ్యమంత్రి మాటలు నీటి మూటలేనా అని ప్రశ్నించారు. కమీషన్లు రావనే గురుకులాలకు నిధులు కేటాయించడం లేదా అని మండిపడ్డారు. హామీలతో మభ్యపెట్టడం, ఆ తర్వాత మాట మార్చడం ఇదే రేవంత్ అనుసరిస్తున్న సిద్ధాంతం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాటలకు, చేతలకు పొంతన ఉండదు అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాష్ట్రంలోని 1024 గురుకులాలకు కేవలం 60 కోట్లు కేటాయించి, గోరంతను కొండంతగా చెప్పుకోవడం సిగ్గు చేటు అన్నారు హరీశ్ రావు.
Ex Minister Harish Rao Slams CM Revanth Reddy
రూ. 12 వేల కోట్లతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాలు ఏర్పాటు చేస్తామని ప్రచారం చేసుకుంటున్న రేవంత్ రెడ్డికి ఆరున్నర లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ బిడ్డలు చదివే గురుకులాలకు కనీసం రూ. 100 కోట్లు కేటాయించే మనసు రాక పోవడం దారుణమన్నారు. మీరు కేటాయించిన చాలీచాలని నిధులతో సిబ్బంది వేతనాలు, మోటార్ల మరమ్మతులు, అత్యవసర పనులు ఎలా సాధ్యం అని నిలదీశారు. చిత్తశుద్ధి లేని సమీక్షలతో గురుకులాలకు ఏం ప్రయోజనం చేకూరుతుందని అన్నారు మాజీ మంత్రి. గురుకులాలకు నిత్యవసరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్లకు ఆరు నెలలుగా పెండింగ్ లో ఉన్న బిల్లులు ఎప్పుడు చెల్లిస్తారని ఫైర్ అయ్యారు.
Also Read : Ex Minister Srinivas Goud Fired on Ministers : మంత్రుల కామెంట్స్ శ్రీనివాస్ గౌడ్ సీరియస్


















