Ex Minister Dharmana : శ్రీకాకుళం జిల్లా : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పేరుతో ప్రజలను ప్రైవేటు ఆస్పత్రులకు బలిచ్చే కార్యక్రమం వెంటనే ఆపాలని, లేదంటే వైయస్సార్సీపీ తరఫున ఉద్యమిస్తామని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Ex Minister Dharmana) కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శ్రీకాకుళంలో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్య, వైద్య రంగాలను ప్రైవేటు యాజమాన్యాల కిందకు తీసుకువెళ్ళి, విద్యార్ధులు, పేదల జీవితాలతో చెలగాటం ఆడేందుకు కూటమి సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజా పోరాటంతోనే అడ్డుకుంటామని స్పష్టం చేశారు. బాధ్యతా రహితంగా ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్కార్ మెడలు వంచి, దానిని ఉపసంహరించుకునే వరకు వెనకడుగు వేయబోమని పేర్కొన్నారు. ప్రజారోగ్యాన్ని బలిపీఠం మీద పెడితే బాధ్యత యుతమైన ప్రతిపక్షంగా సహించేది లేదని అన్నారు.
Ex Minister Dharmana Prasadrao Shocking Comments
ప్రజల ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యతగా భావించాలి. కానీ చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేసి నాణ్యమైన వైద్యం పొందే పేదవాడి హక్కును కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు ధర్మాన ప్రసాదరావు. ఉచిత వైద్యాన్ని అందని ద్రాక్షగా మార్చేశారని అన్నారు. దీనిపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ జరుగుతోందని చెప్పారు. గత వైయస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేసినా రాష్ట్రంలోని వైయస్ జగన్ నేతృత్వంలో సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజల ప్రాణాలను కాపాడగలిగాం అని అన్నారు. ఆనాడు కరోనా విపత్తును సమర్థవంతంగా ఎదుర్కొన్న రాష్ట్రం ఏపీ మాత్రమేనని పేర్కొన్నారు.
Also Read : TTD Pavitrotsavams Interesting : 17 నుండి శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు
















