Ex Minister Appalaraju : అమరావతి – మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఎమ్మెల్యే గౌతు శిరీషపై హాట్ కామెంట్స్ చేశారు. మద్యం సరఫరా, అమ్మకాలపై లోకల్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు. ఇప్పటికే ప్రజలు గమనించారని, ఇక రాబోయే రోజుల్లో వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఆ ట్యాక్స్ వసూలు ఆపేంత వరకు తాము ఊరుకబోమంటూ పేర్కొన్నారు సీదిరి . రాష్ట్రంలో వసూళ్ల పాలన సాగుతోందని ధ్వజమెత్తారు.
Ex Minister Appalaraju Shocking Comments on MLA Sireesha
గురువారం సీదిరి అప్పలరాజు (Ex Minister Appalaraju) మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ హయాంలోనే అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలను సక్సెస్ ఫుల్ గా అందజేశామన్నారు. కానీ కూటమి సర్కార్ వచ్చాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచరణకు నోచుకోని హామీలు ఇచ్చి పవర్ లోకి వచ్చాక వాటి గురించే ఊసెత్తక పోవడం విడ్డూరంగా ఉందన్నారు.
ఉచిత బస్సు పథకం అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని ఎన్నికల సందర్బంగా ప్రకటించారని, కానీ ఇచ్చిన హామీకి తూట్లు పొడుస్తూ చావు కబురు చల్లగా చెప్పారంటూ సీఎం నారా చంద్రబాబు నాయుడును ఏకి పారేశారు. కేవలం జిల్లాల వరకే ఫ్రీ బస్సు స్కీంను అమలు చేస్తామని చెప్పడం మోసం చేయడం తప్పా మరోటి కాదన్నారు సీదిరి అప్పలరాజు.
అధికారం ఉంది కదా అని వైసీపీ నేతలను, మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు బనాయిస్తున్నారని, కానీ ఇలాంటివి మంచి పద్దతి కాదని హితవు పలికారు మాజీ మంత్రి. పవర్ అనేది ఏ ఒక్కరికీ శాశ్వతం కాదని అది తెలుసుకుంటే మంచిదన్నారు.
Also Read : TTD EO Interesting Comments : నాణ్యమైన ఆహార పదార్థాలు అందించాలి – ఈవో
















