YS Jagan : అమరావతి : ఏపీ సర్కార్ నిర్వాకం కారణంగా విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan). సీఎం చంద్రబాబుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. పాలనా పరంగా మీ నిర్లక్ష్యం, మీ అలసత్వం కారణంగా ఇవాళ పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన చెందారు. అయినా మీకు కనికరం కూడా లేకుండా పోయిందన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం బాలికల గిరిజన గురుకుల పాఠశాలలో ఆర్వో ప్లాంటు పాడవడంతో కలుషిత నీరుతాగడం మూలాన, పచ్చ కామెర్లు సోకి 4 రోజుల వ్యవధిలోనే ఇద్దరు బాలికలు ప్రాణాలు కోల్పోయారని ఆరోపించారు. దీనికి సీఎం చంద్రబాబు బాధ్యత వహించాలని అన్నారు జగన్ రెడ్డి.
YS Jagan Slams AP Govt
మరెంతో మంది తీవ్ర అనారోగ్యం పాలయ్యారని మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వానికి, మీ పరిపాలనకు ఇది సిగ్గుచేటు వ్యవహారం కాదా అని ప్రశ్నించారు. 611 మంది చదువుతున్న స్కూళ్లో ఇంత జరుగుతున్నా అసలు పట్టించుకోక పోవడం విడ్డూరంగా ఉందన్నారు మాజీ సీఎం. ఒక ప్రభుత్వం స్పందించాల్సిన తీరు ఇదేనా? ముఖ్యమంత్రిగా మీరు, ఇంతమంది మంత్రులు ఉండి గాడిదలు కాస్తున్నారా అంటూ తీవ్ర స్తాయిలో ధ్వజమెత్తారు జగన్ రెడ్డి. గిరిజన బాలికలు, పేద పిల్లలు అంటే అంత చులకనా? ఒక్క పార్వతీపురం మన్యం జిల్లాలోనే ఒక్క ఏడాదిలో 11 మంది విద్యార్థులు అనారోగ్యంతో మరణించినా మీరు కళ్లు మూసుకున్న మాట వాస్తవం కాదా? ఈ మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
Also Read : Jajula Srinivas Goud Warning : బీసీ రిజర్వేషన్లు అడ్డుకుంటే అగ్గి రాజేస్తం


















