Ex CI J Shankar : అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మాజీ సీఎం జె. శంకర్ రెడ్డి. తనపై లేనిపోని ఆరోపణలు చేయడం పట్ల మండిపడ్డారు. మాజీ ఎంపీ వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి తన గురించి పేర్కొనడాన్ని తప్పు పట్టారు. ఈ మేరకు సీఎం చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మాజీ సీఐ (Ex CI J Shankar) ఏకంగా లీగల్ నోటీసులు పంపించారు. ముఖ్యమంత్రి చేసిన పరువు నష్టం కలిగించే ప్రకటనలు తన ప్రతిష్టకు భంగం కలిగించాయని పులివెందుల మాజీ సిఐ ఆరోపించారు. రూ. 1.45 కోట్ల పరిహారంతో పాటు బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు తన పిటిషన్ లో జె. శంకర్ రెడ్డి.
Ex CI J Shankar Send Notices to CM Chandrababu
దర్యాప్తు సమయంలో చంద్రబాబు పదే పదే దురుద్దేశంతో కూడిన, తప్పుడు ప్రకటనలు చేశారని, కేసును తప్పుగా నిర్వహించారని, సాక్ష్యాలను, రక్తపు మరకలను నాశనం చేయడానికి అనుమతించారని శంకర్ రెడ్డి ఆరోపించారు. సెప్టెంబర్ 18న న్యాయవాది జి. ధరణేశ్వర్ రెడ్డి ద్వారా పంపిన నోటీసులు అసెంబ్లీలో బహిరంగ క్షమాపణ చెప్పాలని , తన వ్యక్తిగత ప్రతిష్టకు నష్టం కలిగించినందుకు రూ. 1.45 కోట్ల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు తన పిటిషన్ లో. దర్యాప్తు సమయంలో నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ 2019లో ప్రభుత్వం సస్పెండ్ చేసింది శంకర్ రెడ్డిని. ప్రస్తుత శంకర్ రెడ్డి కర్నూలు రేంజ్‌లో VRలో ఉన్నారు. ముఖ్యమంత్రిపై ఆయన ప్రత్యక్ష చట్ట పరమైన చర్య విస్తృత చర్చకు దారి తీసింది.
Also Read : Rahul Gandhi Shocking Comments : బీహార్ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఫోకస్

















