TTD : తిరుమల – టీటీడీ ఈవో జె. శ్యామల రావు సంచలన నిర్ణయం తీసుకున్నారు. శనివారం కీలక ప్రకటన చేశారు. టీటీడీలో క్వాలిటీ కంట్రోల్ విభాగంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బి.ఎలిజర్, బర్డ్ ఆస్పత్రిలో స్టాఫ్ నర్స్ ఎస్. రోసి, గ్రేడ్ -1 ఫార్మాసిస్ట్ ఎం. ప్రేమాపతి, ఎస్వీ ఆయుర్వేద ఫార్మసీలలో డాక్టర్ గా పని చేస్తున్న డాక్టర్ జి. అసుంతలను విధుల నుంచి తొలగించినట్లు స్పష్టం చేశారు ఈవో.
TTD Suspended
సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందన్నారు. సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులుగా పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని భావించడమే కాక, హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగిందని స్పష్టం చేశారు జె. శ్యామల రావు.
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే తొలగించడం జరిగిందన్నారు. ఇదే క్రమంలో టీటీడీలో, ఇతర విభాగాలలో పని చేసే వారి పట్ల కూడా నిఘా పెట్టామని, ఎవరైనా హిందూ ధర్మానికి వ్యతిరేకంగా పని చేసినా లేదా చేసినట్లు బయట పడినా కఠిన చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు ఈవో.
Also Read : TTD EO Interesting Comments : పాత భవనాలు వినియోగంలోకి తీసుకు రావాలి
