Minister Konda Surekha Clear Update : కొమురవెల్లి మల్లన్న కళ్యాణం ఘనంగా నిర్వహించాలి

ప్ర‌క‌టించిన దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ

Hello Telugu - Minister Konda Surekha Clear Update

Hello Telugu - Minister Konda Surekha Clear Update

Konda Surekha : హైద‌రాబాద్ : భ‌క్తుల కొంగు బంగారంగా భావించి కొలిచే కొముర‌వెల్లి మ‌ల్ల‌న్న క‌ళ్యాణాన్ని అంగ‌రంగ వైభ‌వోపేతంగా నిర్వ‌హించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు రాష్ట్ర దేవాదాయ‌, ధ‌ర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ‌ (Konda Surekha). సచివాలయంలో సిద్దిపేట జిల్లా ఎండోమెంట్ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాబోయే శ్రీ మల్లికార్జున స్వామివారి కళ్యాణం, జాతరను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశించారు. ఏ ఒక్క‌రికీ ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. అవ‌స‌ర‌మైన నిధుల‌ను మంజూరు చేస్తామ‌ని వెల్ల‌డించారు.

Minister Konda Surekha Comments

వ‌స‌తి సౌక‌ర్యాల‌కు ఇబ్బందులు లేకుండా చూడాల‌ని స్ప‌ష్టం చేశారు మంత్రి కొండా సురేఖ‌. సుదూర ప్రాంతాల నుంచి శ్ర‌మ‌కు ఓర్చి , అష్ట‌క‌ష్టాలు ప‌డి కొముర‌వెల్లి మల్ల‌న్న స్వామిని ద‌ర్శించుకునేందుకు వ‌స్తుంటార‌ని వారికి ప్ర‌శాంతంగా ద‌ర్శ‌నం అయ్యేలా చూడాల్సిన బాధ్య‌త మీపైనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు . ఎక్క‌డ నిర్ల‌క్ష్యం అనేది ఉండ కూడ‌ద‌ని పేర్కొన్నారు మంత్రి. భక్తుల రాకపోకలు, భద్రత, త్రాగునీరు, పారిశుద్ధ్యం, పార్కింగ్ వంటి సౌకర్యాల ఏర్పాటులో అన్ని శాఖలు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని పేర్కొన్నారు. అలాగే ఆలయ అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించి, పెండింగ్‌లో ఉన్న అన్ని పనులను జాతర ప్రారంభానికి ముందే పూర్తి చేయాలని ఆదేశించారు కొండా సురేఖ‌. ఇందుకు సంబంధించి యాక్ష‌న్ ప్లాన్ త‌యారు చేయాల‌ని సూచించారు.

Also Read : Minister Seethakka Shocking Comments : త‌ల్లిదండ్రుల‌ను నిర్ల‌క్ష్యం చేస్తే ఆస్తులు జ‌ప్తు

Exit mobile version