Amazon : అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడిగా ట్రంప్ కొలువు తీరిన తర్వాత దిగ్గజ కంపెనీలకు బిగ్ షాక్ తగిలింది. స్థానికులకే ప్రయారిటీ ఇవ్వాలని కోరారు. ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఎన్నారైలపై ఎక్కువగా ప్రభావం పడింది. దీనికి తోడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో కంపెనీలలో పని చేస్తున్న వారికి నిద్ర లేకుండా చేసింది. ఇప్పటికే గూగుల్, మైక్రో సాఫ్ట్, అడోబ్, పొలారిస్, విప్రో, టీసీఎస్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు తమను నమ్ముకుని పని చేస్తున్న వారిని నిర్దాక్షిణ్యంగా తొలగించే పనికి శ్రీకారం చుట్టాయి. అందరికంటే ముందు దీనిని స్టార్ట్ చేశాడు ఎలాన్ మస్క్. ఇక తాజాగా మరో దిగ్గజ లాజిస్టిక్ కంపెనీ అమెజాన్ (Amazon) కోలుకోలేని ఝలక్ ఇచ్చింది. ఇక ట్రంప్ నిర్ణయాల ప్రభావం హైదరాబాద్ లో కూడా ప్రభావం చూపుతోంది. అమెజాన్ కూడా హైదరాబాద్ కార్యాలయాల్లో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ చేపట్టింది.
Amazon Huge Layoffs in Hyderabad
ఏ – ఐ సాంకేతికత అందుబాటులోకి రావడం, కరోనా పాండమిక్ సమయంలో అవసరానికి మించి ఉద్యోగులను నియమించామని, ఇపుడు మానవ వనరుల అవసరం తగ్గిపోయిందని, ఖర్చులు కూడా అంచనాలను మించి పోతున్నందున దాదాపు 30 వేల మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నామని సంస్థ యాజమాన్యం చెబుతోంది. అయితే ట్రంప్ ఒత్తిడి ప్రధాన కారణమనే ఆరోపణలు ఉన్నాయి..ఏ – ఐ వల్ల ఊహించినంత మెరుగైన సేవలు అందించడం సాధ్యం కాదని.. కేవలం అధిక లాభాల కోసం ఉద్యోగులను తొలగిస్తున్నారని, తక్కువ మంది ఉద్యోగుల చేత వెట్టి చాకిరి చేయించు కోవడమే లక్ష్యంగా అమెజాన్ సంస్థ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని తొలగింపుకు గురైన ఉద్యోగులు విమర్శిస్తున్నారు..
ప్రస్తుతం ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ద్వారా అమెజాన్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించిన హైదరాబాద్ కార్యాలయం. సంస్థ పే రోల్ ఉద్యోగుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.
Also Read : Hydraa Important Update : నిజాయతీ అందరి జీవన విధానం కావాలి



















