Elon Musk : అమెరికా – ప్రపంచ కుబేరులలో టాప్ లో నిలిచిన ఇద్దరు దిగ్గజాలు స్టార్ లింక్ చైర్మన్ ఎలాన్ మస్క్ , ఫేస్ బుక్ సిఇఓ , ఫౌండర్ మార్క్ జుకర్ బర్గ్ తో ఒక్కటయ్యారన్న ప్రచారం జోరందుకుంది. ఇది యావత్ వరల్డ్ మార్కెట్ ను ఒక్కసారిగా విస్తు పోయేలా చేసింది. ఓపెన్‌ఏఐ బిడ్‌కు ఆర్థిక సహాయం చేయడానికి జుకర్‌బర్గ్‌ను చేర్చు కోవడానికి ఎలోన్ మస్క్ ప్రయత్నించారని టాక్. కాగా మెటా లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై జుకర్ బర్గ్ సంతకం చేయ లేదని, 97.4 బిలియన్ల బిడ్‌లో పాల్గొనలేదని ఓపెన్‌ఏఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొంది.
స్టార్టప్‌ను కొనుగోలు చేయడానికి లెటర్ ఆఫ్ ఇంటెంట్‌పై సంతకం చేసిన మరో మూడు పార్టీలను ప్రశ్నించాలని అనుకుంటున్నట్లు ఓపెన్ ఏఐ ఇప్పటికే సూచించిందని మస్క్ న్యాయవాది వెల్లడించారు.
Elon Musk – Zukerberg Deal
ఈ సంవత్సరం దాదాపు100 బిలియన్లకు ఓపెన్ ఏఐని కొనుగోలు చేయడానికి తన అయాచిత బిడ్ కోసం మార్క్ జుకర్‌బర్గ్‌ను చేర్చు కోవడానికి ఎలోన్ మస్క్ (Elon Musk) ప్రయత్నించారని స్టార్టప్ కోర్టు దాఖలులో తెలిపింది. చాట్ జీపీటీ తయారీదారుని కొనుగోలు చేయడానికి ఒప్పందానికి నిధులు సమ కూర్చడం గురించి తాను సంప్రదించిన వ్యక్తులలో మెటా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ జుకర్‌బర్గ్‌ను మస్క్ గుర్తించారని ఓపెన్‌ఏఐ తెలిపింది. ఇదిలా ఉండగా ఫిబ్రవరిలో ఓపెన్‌ఏఐ బోర్డు అధికారికంగా మస్క్ బిడ్‌ను తిరస్కరించింది. మరో వైపు ఓపెన్ ఏఐకి ప్రత్యామ్నాయంగా ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్ కంపెనీ జెమిని ఏఐని తయారు చేసింది. ఇది కూడా ఇప్పుడు టాప్ లో కొనసాగుతోంది.
Also Read : CPI Leader Sudhakar Reddy Death : కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి ఇక లేరు



















