Elon Musk : అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ల దిగ్గజం టెస్లా సారథి ఎలాన్ మస్క్ ఇప్పటికే ప్రపంచంలోనే నంబర్ వన్ ధనవంతుడిగా కొనసాగుతున్నారు. బ్లూంబర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం శుక్రవారం నాటికి ఆయన వ్యక్తిగత సంపద విలువ 378 బిలియన్ డాలర్లు సుమారు ₹33.26 లక్షల కోట్లు)గా నమోదైంది. తాజాగా, ప్రపంచంలోనే తొలి ట్రిలియనీర్ లక్ష కోట్ల డాలర్ల సంపద కలిగిన వ్యక్తిగా మారే అవకాశం మస్క్‌కు (Elon Musk) అందుబాటులోకి రానుంది.
టెస్లా బోర్డు భవిష్యత్ పనితీరును ఆధారంగా చేసుకుని, కార్పొరేట్ చరిత్రలోనే అతిపెద్దదైన ఒక భారీ పారితోషిక ప్యాకేజీని మస్క్‌కు ఆఫర్ చేసింది. చైనా కంపెనీలు బీవైడీ, ఎక్స్‌పెంగ్ వంటి సంస్థల నుంచి పెరుగుతున్న పోటీతో విక్రయాలు పడిపోవడంతో టెస్లా ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Elon Musk – ప్యాకేజీలో భాగంగా నిర్దేశించిన ప్రధాన లక్ష్యాలు:
టెస్లా మార్కెట్ విలువను ప్రస్తుత 1.12 ట్రిలియన్ డాలర్ల నుంచి 8.5 ట్రిలియన్ డాలర్లకు పెంచడం
వార్షిక కార్ల విక్రయాలను 20 లక్షల యూనిట్ల నుంచి 2 కోట్ల యూనిట్లకు చేర్చడం
రోబో ట్యాక్సీలు, హ్యుమనాయిడ్ రోబోల విక్రయాలను 10 లక్షల యూనిట్ల స్థాయికి తీసుకెళ్లడం
ఈ లక్ష్యాలను చేరుకుంటేనే మస్క్‌కు 42.37 కోట్ల టెస్లా షేర్లు దక్కుతాయి. ప్రస్తుతం వీటి విలువ సుమారు 8,780 కోట్ల డాలర్లు. లక్ష్యాలు నెరవేరితే పదేళ్లలో ఈ షేర్ల విలువ ట్రిలియన్ డాలర్లను దాటనుందని అంచనా.
అయితే, ఈ ప్యాకేజీ ప్రయోజనాలను పొందాలంటే మస్క్ కనీసం ఏడున్నరేళ్లు కంపెనీలో కొనసాగాలి. అంతేకాక, నిర్దేశించిన వ్యాపార లక్ష్యాలను గడువులోపు సాధించాలి.
Also Read : Trump Interesting Comments on Modi : ప్రధాని మోదీ పై ప్రశంసలు కురిపించిన ట్రంప్
