Elon Musk : ప్రపంచవ్యాప్తంగా జనాభా క్షీణిస్తున్న వేళ, టెక్నాలజీ వ్యాపారవేత్త ఎలాన్ మస్క్ మరోసారి దీని తీవ్రతపై హెచ్చరికలు జారీ చేశారు. “మానవ జాతి భవిష్యత్తు కోసం ప్రతి జంట కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలి” అంటూ తన అభిప్రాయాన్ని ఆయన వెల్లడించారు.
ఇటీవల వ్యాపారవేత్త మారియో నఫాల్ ప్రపంచ దేశాల్లో తగ్గుతున్న సంతానోత్పత్తి రేటును గణాంకాలతో వివరించిన ట్వీట్‌కు స్పందిస్తూ మస్క్ (Elon Musk) తన ఆందోళనను వ్యక్తం చేశారు. “ఇప్పటి పరిస్థితుల్లో ప్రతి మహిళకు సగటున 2.7 మంది పిల్లలు జన్మించాల్సిన అవసరం ఉంది. లేనిపక్షంలో మానవజాతి అంతరించిపోవచ్చు” అని నఫాల్ పేర్కొన్నట్లు తెలిపారు.
Elon Musk – ప్రస్తుతం:
అమెరికాలో సగటు సంతానం సంఖ్య: 1.66
ఇటలీ: 1.29
జపాన్: 1.30
ఇంత తక్కువ రేటు ఉంటే జనాభా స్థిరంగా ఉండదని, పిల్లలు లేని జంటల సంఖ్య కూడా కలుపుకుని చూస్తే సమస్య మరింత తీవ్రంగా ఉందని మస్క్ పేర్కొన్నారు.
ఇది కొత్త విషయం కాదని, గతంలో కూడా మస్క్ ఇదే అంశంపై పలుమార్లు స్పందించారు. రోమ్ సామ్రాజ్యపతనం వంటి అనేక పురాతన నాగరికతలు జనాభా తరుగుదల కారణంగా కూలిపోయాయని గుర్తుచేశారు. “దురదృష్టవశాత్తూ చరిత్రకారులు దీనిపై తగినగా దృష్టి సారించలేదు” అంటూ వ్యాఖ్యానించారు.
1963లో ప్రపంచవ్యాప్తంగా ఒక మహిళకు సగటు పిల్లల సంఖ్య 5.3 కాగా, ప్రస్తుతం అది 2.5కు పడిపోయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇది కొనసాగితే ఆర్థిక మందగమనం, కార్మికుల కొరత వంటి సమస్యలు వేగంగా వేగించగలవని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ పరిస్థితిపై ప్రజలు, పాలకులు చింతించాల్సిన అవసరం ఉందని, మానవజాతి భవిష్యత్తును రక్షించాలంటే పిల్లల జననంపై ప్రోత్సాహం అవసరం అని మస్క్ స్పష్టం చేస్తున్నారు.
Also Read : Popular Cricketer Kohli : 40 కోట్ల పెట్టుబడితో కొత్త వ్యాపారం రంగంలోకి దిగిన విరాట్ కోహ్లీ



















