EC : ఢిల్లీ : భారత ఎన్నికల సంఘం గురువారం కీలక ప్రకటన చేసింది. గత ఆరు నెలల్లో 30వ ప్రధాన చొరవగా ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను క్రమబద్ధీకరించే లక్ష్యంతో కొత్త ఆదేశాన్ని ప్రకటించింది. ఓట్ల లెక్కింపు సమయంలో జాప్యాలను తగ్గించడానికి , ఎక్కువ స్పష్టత, ఏకరూపతను నిర్ధారించడానికి ప్రయత్నిస్తుందని పేర్కొంది.వికలాంగులు , 85 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఇంటి ఓటింగ్ వంటి ఇటీవలి కార్యక్రమాల ఫలితంగా పోస్టల్ బ్యాలెట్ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదలకు ప్రతిస్పందనగా ఈసీ (EC) ఈ నిర్ణయం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపు సాధారణంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల నుండి ఓట్ల లెక్కింపునకు ముందే ముగుస్తుంది.
EC Key Comments on Counting
అయితే ఈ ప్రక్రియను అధికారికం చేయడానికి కొత్త చర్య రూపొందించేలా చర్యలు చేపట్టింది ఈసీ. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతున్న కౌంటింగ్ కేంద్రంలో, పోస్టల్ బ్యాలెట్ పత్రాల లెక్కింపు పూర్తయిన తర్వాతే ఈవీఎం, వీవీప్యాట్ లెక్కింపు చివరి రౌండ్ చేపట్టాలని స్పష్టం చేసింది తాజాగా జారీ చేసిన ప్రకటనలో. పెద్ద సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్లు ఉన్న సందర్భాల్లో, తగినంత సంఖ్యలో టేబుళ్లు, లెక్కింపు సిబ్బంది ఉండేలా రిటర్నింగ్ ఆఫీసర్లు చూసుకోవాలని స్పష్టం చేసింది. దీని వల్ల ఎలాంటి ఆలస్యం జరిగేందుకు వీలు ఉండదని పేర్కంది. ఓటర్ల సౌలభ్యాన్ని మెరుగు పరచడానికి, ఎన్నికల వ్యవస్థలను బలోపేతం చేయడానికి , సాంకేతిక పరిజ్ఞాన వినియోగాన్ని పెంచడానికి ప్రయత్నం చేస్తోంది ఈసీ.
Also Read : Farooq Abdullah Shocking Comments : లడఖ్ తో కేంద్రం చర్చలు జరపాలి : అబ్దుల్లా
















