ముంబై : తాజాగా ప్రముఖ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ పై లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ముంబైలో కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటలనో నటుడితో పాటు డ్రైవర్, ఇతరులకు గాయాలు అయ్యాయి. విషయం తెలిసిన వెంటనే గాయపడిన టైగర్ ష్రాఫ్ ను పరామర్శించారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే. 1990వ దశకంలో వ్యవస్థీకృత నేరాలపై ముంబై పోలీసులు చేపట్టిన ఉక్కు చర్యను ఉప ముఖ్యమంత్రి ఈ సందర్బంగా ప్రస్తావించారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని ఆయన పునరుద్ఘాటించారు. టైగర్ ష్రాఫ్ చేయి , ఛాతీపై కట్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి . జుహు ప్రాంతంలో జరిగిన కాల్పుల ఘటన అనంతరం షిండే టైగర్ ష్రాఫ్‌ను కలిశారు. ఈ దాడిలో నటుడు క్షేమంగా బయట పడ్డారు.
ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు డిప్యూటీ సీఎం. ఇది చాలా ఆందోళనకరమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని షిండే హామీ ఇచ్చారు. తాను ముంబై పోలీస్ కమిషనర్‌తో మాట్లాడానని, నిందితులను పట్టుకుని అరెస్టు చేయడానికి అనేక బృందాలను ఏర్పాటు చేశారని తెలిపారు. ముంబైని, దాని పౌరులను సురక్షితంగా ఉంచడమే మా ప్రస్తుత ప్రాధాన్యత. సెలబ్రిటీ అయినా, సాధారణ పౌరుడైనా వారి భద్రతను నిర్ధారించడం పోలీసు, ప్రభుత్వ బాధ్యత. ఈ విషయంలో ఎలాంటి అలసత్వం ఉండదు, వారు ఎవరైనా సరే ఏ ముఠానూ వదిలిపెట్టం అని ఏక్నాథ్ షిండే మీడియాతో మాట్లాడుతూ అన్నారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే వారిపై కఠినంగా వ్యవహరించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని మరోసారి పునరుద్ఘాటించారు. తెలియని వారి కోసం, ఆదివారం సాయంత్రం జుహులో ముగ్గురు మోటార్‌సైకిల్‌పై వచ్చిన వ్యక్తులు టైగర్ కారుపై కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి.


















