ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ద్వారా విద్యా, వైద్యం, ఉపాధి క‌ల్ప‌న‌

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన నారా భువ‌నేశ్వ‌రి

hellotelugu-NTRTrust

చిత్తూరు జిల్లా : ఎన్టీఆర్ ట్ర‌స్ట్ ఆధ్వ‌ర్యంలో అనేక సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తున్నామ‌ని చెప్పారు ట్ర‌స్టీ నారా భువ‌నేశ్వ‌రి. ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతిలో నాలుగు బ్లడ్ బ్యాంక్స్ నిర్వహిస్తున్నాం అన్నారు. త్వరలో విజయవాడలో ప్రారంభిస్తాం అని ప్ర‌క‌టించారు. తలసేమియా బాధితుల కోసం మే 10న హైదరాబాద్ లో నిర్వహించే రన్ లో అందరూ పాల్గొని వారికి ధైర్యం చెప్పాలని భువనేశ్వరి కోరారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హెల్త్ క్యాంపుల నిర్వహిస్తున్నాం. వీటి ద్వారా 23 లక్షల మందికి సేవలు అందించాం. ఇందు కోసం రూ.23 కోట్లు ఖర్చు చేశాం. ఎన్టీఆర్ సంజీవని ద్వారా పేద ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పిస్తున్నాం. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నాం. ఏజెన్సీ ఏరియాల్లో హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తున్నాం. హైదరాబాద్ గండిపేటలో ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్, డిగ్రీ కాలేజ్ ఉన్నాయి.

ఎన్టీఆర్ మెమోరియల్ స్కూల్ ద్వారా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చే పిల్లలకు గణితం, ఆంగ్లంలో పట్టు సాధించేలా శిక్షణ అందిస్తున్నాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామంటే అందుకు దాతలు, మా సిబ్బంది సహకారమే కారణం అన్నారు. ఒకప్పుడు ఇంటికే పరిమితమైన నాకు చంద్రబాబు హెరిటేజ్ బాధ్యతలు అప్పగించినప్పుడు ఏం చేయాలో, ఎలా మాట్లాడాలో కూడా తెలిసేది కాదు. ఏదైనా చేయగలను అని ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే విజయం సాధించగలం. మహిళల ఆర్థక స్వావలంబన కోసం కుప్పంలో స్త్రీ శక్తి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేశాం. ఇక్కడ శిక్షణ తీసుకున్న మహిళలు ఆర్థికంగా వారి కాళ్లపై వారు నిలబడుతున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన మహిళల ఉత్పత్తులు మార్కెటింగ్ కోసం హైదరాబాద్ లో స్త్రీ శక్తి హస్తకళ స్టోర్ ఏర్పాటు చేశామని భువనేశ్వరి తెలిపారు.

Exit mobile version