గుంటూరు జిల్లా : చదువు ఒక్కటే మనిషికి గుర్తింపు ఇస్తుందని, అందుకే దానిని వదలకుండా చదువుకునేందుకు ప్రయత్నం చేయాలన్నారు మంత్రి వంగలపూడి అనిత. శనివారం గుంటూరులోని దేవర సాయి కృష్ణ కల్యాణ మండపంలో ప్రతిభ పురస్కారాలు పంపిణీ చేశారు విద్యార్థులకు. ఈ సమావేశంలో పాల్గొన్నారు కురుబ, కురుమ సామాజిక వర్గీయులు. టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన 104 మంది కురబ, కురమ విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు, నగదు అందించారు. టెన్త్, ఇంటర్ లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన కురుబ, కురమ, కురవ విద్యార్థులకు పురస్కారాలు అందజేయడం అభినందనీయం అన్నారు. విద్యలో రాణిస్తున్న విద్యార్థులను సత్కరించడం ద్వారి వారికి మరింత ప్రోత్సాహం లభించినట్లు అవుతుందని చెప్పారు.
అందుకే కూటమి ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యమిస్తోందని అన్నారు అనిత వంగలపూడి. మంత్రి నారా లోకేశ్ . ఏపీ విద్యా వ్యవస్థను అత్యున్నత స్థానాలకు తీసుకెళుతున్నారని ప్రశంసించారు. గత పాలనలో భ్రష్టుపట్టిన విద్యా వ్యవస్థను గాడిన పెడుతున్నారని పేర్కొన్నారు. టెన్త్, ఇంటర్ పరీక్షలకు ముందు వంద రోజుల ప్రణాళికలు అమలు చేసి, అత్యుత్తమ ఫలితాలు సాధించడంలో మంత్రి లోకేశ్ ముందు చూపు ఉందన్నారు. తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు, సన్నబియ్యంతో భోజనం, నాణ్యమైన విద్య ప్రభుత్వ విద్యా సంస్థల్లో అందుతున్నాయన్నారు. .బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో ఆహార, ఆరోగ్య భద్రతతో కూడిన నాణ్యమైన విద్యను అందిస్తున్నాం అని చెప్పారు అనిత వంగలపూడి. ఆర్వో ప్లాంట్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. బీసీ గురుకులాలు, బీసీ హాస్టళ్లలో నిరంతర విద్యుత్ కు ఇన్వర్టర్లు అమర్చుతున్నాం అని పేర్కొన్నారు. స్పోర్ట్స్ కిట్లు అందజేయ బోతున్నాం అని ప్రకటించారు.

















