ED : దేశ రాజధాని ఢిల్లీలోని ఎన్ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) అధికారులు, రిలయన్స్ పవర్ సీఎఫ్ఓ అశోక్ పాలును శుక్రవారం (అక్టోబర్ 10, 2025) రాత్రి అరెస్ట్ చేశారు. ఈడీ అధికారులు మనీ లాండరింగ్ నివారణ చట్టం (PMLA) కింద విచారణ జరిపిన అనంతరం, ఆయనను నకిలీ బ్యాంక్ హామీ కేసులో అదుపులోకి తీసుకున్నారు.
ED Shocking Anil Ambani
వివరాల ప్రకారం, రూ. 68 కోట్ల నకిలీ బ్యాంక్ గ్యారంటీ కేసు నేపథ్యంలో ఈడీ దర్యాప్తు జరుపుతోంది. ఈ కేసులో అశోక్ పాల్‌పై కీలక పాత్ర ఉందన్న అనుమానాల నేపథ్యంలో అధికారులు ఆయనను ప్రశ్నించిన తరువాత అరెస్ట్ చేసినట్లు సమాచారం.
శనివారం ఉదయం అశోక్ పాలను ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు హాజరుపరచగా, కోర్టు ఆయనను రెండు రోజుల ఈడీ కస్టడీకి పంపించింది. రాబోయే సోమవారం (అక్టోబర్ 13) ఆయనను మళ్లీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరచనున్నారు.
అశోక్ పాల్ ప్రస్తుతం రిలయన్స్ పవర్ లిమిటెడ్ (RPL) కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా (CFO) పనిచేస్తున్నారు. ఈ కంపెనీలో ప్రజా వాటా 75 శాతం కంటే ఎక్కువగా ఉంది.
మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ దర్యాప్తు కొనసాగిస్తోంది.
Also Read : Gold Price Growth : పసిడి పరుగులు కొనసాగుతున్నాయి – వెండి కూడా రికార్డు స్థాయిలో పెరుగుదల



















