రోడ్ల కనెక్టివిటీతో ఎకనామిక్ యాక్టివిటీ

సమీక్షించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

hellotelugu-CM

అమరావతి : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఆర్ధిక కార్యకలాపాలకు ఊతమిచ్చేలా జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణం జరగాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దిశా నిర్దేశం చేశారు. జాతీయ రహదారులు రాష్ట్రంలోని పోర్టులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాలను కనెక్ట్ చేసేలా నిర్మాణం చేపట్టాలని సూచించారు. సచివాలయంలో రహదారులు భవనాలు, రవాణా, జాతీయ రహదారి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో రోడ్ల నిర్వహణ, పాత్ హోల్ ఫ్రీ రహదారులు, ఈవీ బస్సుల వినియోగం, వివిధ రాష్ట్రాలను అనుసంధానించేలా జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణంపై సమీక్షలో చర్చించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రహదారుల నిర్వహణ పటిష్టంగా ఉండాల‌న్నారు. మొత్తంగా 45,433 కిలోమీటర్ల మేర రోడ్లు ఉంటే వాటిల్లో ఏటా 10,238 కిలోమీటర్ల మేర నిరంతర నిర్వహణ చేయాల్సి ఉందన్నారు. ప్రజలకు రోడ్ల వల్ల ఇబ్బంది లేకుండా చూడాలని, రోడ్ల నిర్వహణ అనేది నిరంతర ప్రక్రియగా చేపట్టాల‌న్నారు. ఎక్కడైనా రోడ్లకు గుంతలు పడితే వాటినే వెంటనే సరిదిద్దితే ఇక ఇబ్బందులు ఉండవు అన్నారు సీఎం. రోడ్ల నిర్వహణలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎలాంటి పద్దతులను అవలంబిస్తున్నారనే అంశాన్ని అధ్యయనం చేయాలని స్ప‌ష్టం చేశారు. ఆర్ అండ్ బీ రహదారుల మెయింటెనెన్స్ కోసం నిధుల కొరత లేకుండా చూడాల‌న్నారు. వివిధ ప్రాంతాల్లో భౌగోళిక పరిస్థితులను అధ్యయనం చేసి దాని ఆధారంగా రహదారుల నిర్మాణం జరగాలన్నారు.

Exit mobile version