Pawan Kalyan : తిరుపతి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల (Pawan Kalyan) ఆకస్మిక తనిఖీలతో హోరెత్తించారు. శనివారం తిరుపతి జిల్లా మంగళంలో అటవీ శాఖకు చెందిన ఎర్ర చందనం గొడౌన్ ను తనికీ చేశారు. మొత్తం గో డౌన్ ను కలియ తిరిగారు. అన్నింటిని దగ్గరుండి పరిశీలించారు. మొత్తం ఎనిమిది గో డౌన్లలో ఉన్న ఎర్ర చందనం లాట్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటి వరకు సేకరించిన, నిల్వ ఉంచిన ఎర్ర చందనం దుంగలకు సంబంధించిన పూర్తి నివేదికను తనకు సమర్పించాలని ఆదేశించారు పవన్ కళ్యాణ్ కొణిదల. ఎ, బి. సీ, నాన్ గ్రేడ్ ల వారీగా దుంగల వివరాలు అడగడంతో అక్కడున్న అధికారులు అవాక్కయ్యారు. ప్రతి గోడౌన్ లో రికార్డులు పరిశీలించారు పవన్ కళ్యాణ్ కొణిదల.
DY CM Pawan Kalyan Shocking
ఈ సందర్బంగా అటవీ శాఖ ఉన్నతాధికారులకు ముచ్చెమటలు పట్టించారు డిప్యూటీ సీఎం. ప్రతి ఎర్ర చందనం దుంగకి ప్రత్యేక బార్ కోడింగ్, లైవ్ ట్రాకింగ్ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అంతే కాకుండా పట్టుబడిన దగ్గర నుంచి అమ్ముడు పోయే వరకు ఒక్క దుంగ కూడా మిస్ అవకూడదని స్పష్టం చేశారు. ఏ ఒక్కటి మిస్ అయినా తాను ఊరుకోబోనంటూ వార్నింగ్ ఇచ్చారు. విధుల్లో నిర్లక్ష్యం పనికి రాదని, ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పని చేయాలని పేర్కొన్నారు డిప్యూటీ సీఎం. ఒక్క ఏపీలోనే ఎర్ర చందనం దుంగలు ఎక్కువగా లభ్యం అవుతాయి. దీనిపై సినిమా కూడా వచ్చింది. అది దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయలను కలెక్షన్స్ చేసింది. దానికి దర్శకత్వం సుకుమార్ వహించగా అల్లు అర్జున్ , రష్మిక మందన్నా కీ రోల్ పోషించింది. పుష్ప మూవీ వచ్చాక ఈ కలప స్మగ్లింగ్ వ్యవహారం మరింత చర్చనీయాంశంగా మారింది.
Also Read : PM Modi Shocking Comments on India Alliance : ఇండియా కూటమి అంటే జంకుతున్న జనం


















