Pawan Kalyan : అమరావతి : పాలనా పరంగా మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ కీలకమైన పాత్ర పోషిస్తుందని స్పష్టం చేశారు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలకమైన కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిథిగా సీఎంతో పాటు డిప్యూటీ సీఎం హాజరయ్యారు. కీలక సూచనలు చేశారు. ప్రధానంగా ఏఐ వినియోగం గురించి ప్రస్తావించారు. మరో వైపు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈనెల 14,15 వ తేదీలలో రెండు రోజుల పాటు సీఐఐ సదస్సు 2025 నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి తను కూఢా హాజరయ్యే అవకాశం ఉంది. మరో వైపు సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచాయతీరాజ్, అటవీశాఖకు కూడా వర్తింప చేయాలని ఇప్పటికే స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్ కొణిదల.
DY CM Pawan Kalyan Key Update
ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల్లోని అటవీ పరిసర గ్రామాల్లో అడవి ఏనుగులు చొరబడి చేస్తున్న విధ్వంసాన్ని అరికట్టేందుకు, మానవ వన్యప్రాణి సంఘర్షణను నిలువరించేందుకు డిప్యూటీ సీఎం నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఆవిష్కరించింది. చిత్తూరు జిల్లాలో పైలెట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించిన ఎ.ఐ (AI) ఆధారిత వ్యవస్థ, సౌరశక్తి సాయంతో పని చేస్తూ ఏనుగుల సంచారాన్ని గుర్తించడంతో పాటు వాటిని స్వల్పంగా భయపెట్టి సహజ సిద్ధమైన నిరోధక వ్యవస్థను కలిగి ఉంటుంది. అటవీ ఏనుగుల సమస్య పరిష్కారానికి కర్ణాటక ప్రభుత్వ సహకారంతో నాలుగు కుంకీ ఏనుగులను పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి తీసుకు వచ్చారు.
Also Read : Delhi Red Fort Bomb Blast : ఢిల్లీ పేలుళ్ల ఘటనపై దర్యాప్తు ముమ్మరం


















