DY CM Pawan : తిరుపతి జిల్లా : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (DY CM Pawan) నిప్పులు చెరిగారు. ఆయన సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని రక్త గాయం నుంచి పుట్టిన వృక్ష సంపదను కాపాడుకుని తీరుతామని ప్రకటించారు. తిరుపతి, చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పర్యటించారు. ఎర్ర చందనం స్మగ్లింగ్ లో నలుగురు కింగ్ పిన్స్ ను గుర్తించామని సంచలన ప్రకటన చేశారు. స్మగ్లర్ల ఆస్తుల స్వాధీనం చేసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. వైసీపీ హయాంలో వేల కోట్ల సంపద తరలి పోయిందని ఆరోపించారు. దేశంలో ఎక్కడ ఎర్రచందనం పట్టుబడినా ఆంధ్రప్రదేశ్ కు ఆ వన సంపద చెందేలా కృషి చేశామన్నారు పవన్ కళ్యాణ్. ప్రజా సంక్షేమం ప్రకృతి సంపద రక్షణ కూటమి ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. మంగళంలో అటవీశాఖకు చెందిన గోడౌన్లను పరిశీలించారు.
DY CM Pawan Kalyan Comments
అనంతరం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఎర్ర చందనం అనేది శేషాచలం అడవుల్లో తప్ప ప్రపంచం లోనే ఎక్కడా దొరకని అపురూపమైన అటవీ సంపద అని చెప్పారు. శ్రీ వెంకటేశ్వర స్వామికి గాయం అయినప్పుడు ఆయన రక్తంతో ఉద్భవించిన వృక్షంగా ఎర్ర చందనాన్ని పురాణాలు చెబుతాయన్నారు. అందుకే ఈ అపురూప సంపద శేషాచలంలో తప్ప మరెక్కడా ఇంత నాణ్యతతో ఉండదన్నారు. ఇది హిందువుల మనోభావాలతో, వారి నమ్మకాలతో ముడిపడి ఉన్న గొప్ప వృక్ష సంపద అని పేర్కొన్నారు. దీన్ని కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత కావాలని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.
Also Read : Hydraa Sensational Updates : హైడ్రా పనితీరుకు మద్దతుగా ర్యాలీ


















