Bhatti Vikramarka : వికారాబాద్ జిల్లా : ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ సర్కార్ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రయత్నం చేస్తోందన్నారు. ఇందులో భాగంగా పెద్ద ఎత్తున ఉచిత పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలో రూ. 1000 కోట్ల రూపాయలతో విద్యుత్ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పరిగిలో 9 – 33/11 కేవీ సబ్ స్టేషన్లతో పాటు 220 కేవీ , 400 కేవీ సబ్ స్టేషన్లు మంజూరు చేశామన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ అని కరెంట్ అంటేనే తమ పార్టీ అని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ంలో పెద్ద ఎత్తున ఉచిత విద్యుత్ అందిస్తున్నామని చెప్పారు.
DY CM Bhatti Vikramarka Comments
మొత్తం 53 లక్షల పేద కుటుంబాలకు గృహ జ్యోతి పథకం కింద 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఇందుకు గాను ప్రతి నెల రాష్ట్ర ప్రభుత్వం రూ. 2,830 కోట్లు విద్యుత్ శాఖకు చెల్లిస్తోందని చెప్పారు మల్లు భట్టి విక్రమార్క. వికారాబాద్ జిల్లాలో 1.43 లక్షల నిరుపేద కుటుంబాలకు ఉచిత విద్యుత్ లభిస్తోందన్నారు. ఇక పరిగిలో 44,500 కుటుంబాలకు లబ్ది పొందుతున్నట్లు చెప్పారు. పేద ప్రజల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం రూ. 1.6 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగిందన్నారు డిప్యూటీ సీఎం. రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రతి ఇంటికి రూ. 5 లక్షలు ఇచ్చామన్నారు. 93 లక్షల కుటుంబాలకు సన్న బియ్యం, ఆరోగ్యశ్రీ కింద రూ.10 లక్షల వైద్యంతో పాటు 60 వేల జాబ్స్ కల్పంచామన్నారు.
Also Read : Palla Srinivasa Rao Strong Focus : ప్రజా సమస్యల పరిష్కారంపై ఫోకస్ : పల్లా

















