Bhatti Vikramarka : హైదరాబాద్ : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రజా ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మెరుగైన విద్యుత్ సరఫరా చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ భవిష్యత్తు అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని, రాష్ట్ర జిడిపి వృద్ధికి అవసరమైన విద్యుత్ అవసరాలను తీర్చేందుకు సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు ప్రభుత్వం ముందస్తు ప్రణాళికలు రూపొందించడం జరిగిందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశాలతో పోటీపడేలా, 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే దిశగా స్పష్టమైన రోడ్ మ్యాప్‌ను సిద్ధం చేస్తున్నామని మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.
DY CM Bhatti Vikramarka Key Update
3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరాలంటే రాష్ట్ర GSDP ఏటా కనీసం 30 శాతం పెరగాల్సిన అవసరం ఉందన్నారు డిప్యూటీ సీఎం. ఈ వృద్ధికి అనుగుణంగా విద్యుత్ వినియోగం ప్రతి సంవత్సరం సగటున 10 శాతం పెరుగుతుందని అంచనా వేశామన్నారు. అందువల్ల 2047 నాటికి రాష్ట్రానికి 1,39,000 మెగావాట్లకు పైగా విద్యుత్ అవసరం ఉంటుందని పేర్కొన్నారు మల్లు భట్టి విక్రమార్క. ప్రస్తుతం తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 27,769 మెగావాట్లుగా ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ఉత్పత్తి–వినియోగం–అవసరాలపై సమగ్ర ప్రణాళికలతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని వెల్లడించారు మల్లు భట్టి విక్రమార్క.
Also Read : Minister Ponguleti Interesting Update : మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు : పొంగులేటి
















