హైదరాబాద్ : కేరళ స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ కెరీర్ ఇక ముగిసినట్టేనా. అవుననే సమాధానం వస్తోంది క్రికెట్ వర్గాల నుంచి . ఏరికోరి తీవ్ర ఒత్తిళ్లను తట్టుకుని హెడ్ కోచ్ గంభీర్ , కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్, బీసీసీఐ సెలెక్షన్ కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ శాంసన్ ను న్యూజిలాండ్ సీరీస్ తో పాటు ఐసీసీ టి20 వరల్డ్ కప్ కోసం ఎంపిక చేశారు. ఇప్పటికే యంగ్ క్రికెటర్లు పెద్ద ఎత్తున పోటీ పడుతున్నారు ఆడేందుకు. ఈ తరుణంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన శాంసన్ అత్యంత నిర్లక్ష్యంగా ఆడాడు. అనవసరమైన షాట్స్ కోసం వెళ్లి వికెట్లను పారేసుకున్నాడు. దీంతో తను 5 మ్యాచ్ లు ఆడాడు. ఇందులో తను చేసిన పరుగులు 50 మాత్రమే. 10, 6, 0, 24, 6 పరుగులు చేసి అందరినీ విస్తు పోయేలా చేశాడు.
ఈ తరుణంలో గత రెండు ఏళ్లుగా ఆటకు దూరంగా ఉన్నాడు ముంబైకి చెందిన ఇషాన్ కిషన్. తను దుమ్ము రేపాడు. తిరువనంతపురం వేదికగా సెంచరీ చేశాడు. న్యూజిలాండ్ పై భారీ విజయాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ తరుణంలో హెడ్ కోచ్ గంభీర్ ఇగ్ షాక్ ఇచ్చాడు. సంజూ శాంసన్ ను వికెట్ కీపర్ గా తొలగించాడు. తన స్థానంలో ఇషాన్ కిషన్ ను కీపింగ్ చేయమని చెప్పాడు. తనకు సంపూర్ణ మద్దతు ఇచ్చినా సద్వినియోగం చేసుకోలేక పోయాడు. దీంతో తనంత దురదృష్టవంతుడు ఎవరూ లేరని తేలి పోయింది. మొత్తంగా టి20 వరల్డ్ కప్ నుంచి శాంసన్ అవుట్ అని తేలి పోయింది.


















