Dr SRK Dixit : హైదరాబాద్ : రాష్ట్రంలో అత్యంత పేరు పొందిన ఆర్థోపెడిక్ డాక్టర్ ఎస్ ఆర్ కే దీక్షిత్ (Dr SRK Dixit) కు అరుదైన గౌరవం లభించింది. ఆయన ఎంతో మందికి కీళ్ల మార్పిడి చేశారు. పెద్ద ఎత్తున ఆపరేషన్లు చేయడంలో తను దిట్టగా పేరు పొందారు. తన రంగంలో విశిష్ట సేవలు అందించినందుకు గాను డాక్టర్ ఎస్.ఆర్.కె. దీక్షిత్ కు ఆర్థోపెడిక్స్ , జాయింట్ రీప్లేస్‌మెంట్ అవార్డు – 2025 లో ఎక్సలెన్స్ తో సత్కరించారు.
Dr SRK Dixit Gets Great Award
కీళ్ల మార్పిడి, ఎముక శస్త్ర చికిత్సలలో తన అసాధారణ నైపుణ్యానికి గాను ఆర్థోపెడిక్ నిపుణుడు డాక్టర్ ఎస్.ఆర్.కె. దీక్షిత్ కు గుర్తింపు లభించింది. అద్భుతమైన ఫలితాలతో అనేక సంక్లిష్టమైన విధానాలను విజయవంతంగా నిర్వహించిన ఆయనకు ఈరోజు కేంద్ర మంత్రి గంగాపురం కిషన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావులు హైదరాబాద్ లో జరిగిన కీలక కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరై బహూకరించారు. ఎక్సలెన్స్ ఇన్ ఆర్థోపెడిక్స్ , జాయింట్ రీప్లేస్‌మెంట్ అవార్డు – 2025 ను ప్రదానం చేశారు.
ఇదిలా ఉండగా విశిష్టమైన పురస్కారం అందుకున్నందుకు గాను సంతోషం వ్యక్తం చేశారు డాక్టర్ ఎస్ఆర్కే దీక్షిత్. తనకు దక్కిన అవార్డు తన శస్త్ర చికిత్సలతో బాగుపడిన వారందరికీ అంకితం ఇస్తున్నట్లు తెలిపారు. ఇలాంటి గుర్తింపులు రోగుల పట్ల మరింత అంకితభావం, కరుణ, నిబద్ధతతో సేవ చేయడానికి మరింత స్పూర్తిని ఇచ్చేలా చేస్తాయన్నారు . ప్రస్తతం తను అపోలో హాస్పిటల్స్ లో డాక్టర్ గా సేవలు అందిస్తున్నారు.
Also Read : YSRCP Shocking Comments : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై యుద్దం


















