Dr Sirisha : తిరుపతి : తిరుపతి గ్రామ దేవత గంగమ్మ ఆలయ అభివృద్ధి అవసరాల నిమిత్తం ప్రవేటు స్తలం కొనుగోలు కోసం 5 లక్షలు విరాళంగా టిటిడి మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ గారి చేతుల మీదుగా అందివ్వడం సంతోషంగా ఉందని అన్నారు తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష (Dr Sirisha). వైష్ణవి హాస్పిటల్ అధినేత తన భర్త డాక్టర్ మునిశేఖర్, ఇతర తమ కుటుంబ సభ్యులతో కలిపి తమ విరాళాన్ని ఆలయ ఈఓకి కరుణాకర్ రెడ్డి చేతులు మీదుగా అందించారు. ఈ సందర్భంగా మేయర్ డాక్టర్ శిరీష మీడియాతో మాట్లాడారు. మన అందరి గ్రామ దేవత గంగమ్మ ఆలయ అవసరాల కోసం ఆలయానికి అనుకుని ఉన్న ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేయడానికి అవసరమైన నిధులు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో గంగమ్మ భక్తులుగా మా కుటుంబం కూడా భాగస్వామ్యం కావాలని బావించి ఐదు లక్షల రూపాయలను ఈవోకు ఇచ్చామన్నారు. స్థలం కొనుగోలు కోసం ఈ విరాళాన్ని వినియోగించాలని కోరామన్నారు.
Dr Sirisha Demands
భూమన కరుణాకర్ రెడ్డి చేతులు మీదుగా ఇవ్వాలని ఎందుకు నిర్ణయించుకున్నామని అంటే గంగమ్మ ఆలయ అభివృద్ధి కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు, కృషి కారణంగానే వారి చేతులు మీదుగా అందివ్వడం సముచితంగా ఉంటుందని భావించామన్నారు. భూమన ఎమ్మెల్యే గా ఉన్నప్పుడే ఆలయానికి అనుకుని ఉన్న కొంత ప్రవేటు స్తలం కొనుగోలు చేస్తే ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యాలకు ఉపయోగంగా ఉంటుందని సంకల్పించారని తెలిపారు. సాంకేతిక కారణాలతో ఆగిన ఈ మంచి కార్యక్రమం ఇవాళ ముందుకు సాగుతుంది అంటే నాడు భూమన చేసిన సంకల్పం తప్ప మరోటి కాదన్నారు. ఆనాడే తమ కుటుంబం మనం కూడా ఈ కృషిలో భాగస్వామ్యం కావాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇవాళ ఇది ఆచరణలో జరగడం సంతోషంగా ఉందన్నారు డాక్టర్ శిరీష.
Also Read : Popular Cricketer Shubman Gill : వన్డే జట్టు కెప్టెన్ గా శుభ్ మన్ గిల్


















