Tirupati : ఢిల్లీ – భారత ప్రభుత్వం ప్రతి ఏటా నగర పాలక సంస్థలకు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డు స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డు ను తిరుపతి నగర ప్రజల తరపున అందుకునే అరుదైన గౌరవం దక్కినందుకు గర్వంగా ఉందని అన్నారు తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుకు తిరుపతి నగరం ఎంపిక అయిన నేపథ్యంలో నూఢిల్లీలోని విద్యా భవన్ లో భారత రాష్టపతి చేతుల మీదుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, నగరపాలక సంస్థ కమీషనర్ మౌర్య తో కలిపి తిరుపతి నగర పాలక సంస్థ మేయర్ డా శిరీష అవార్డును స్వీకరించారు.
Tirupati Mayor Dr. Sirisha
ఈ సందర్భంగా మేయర్ తన స్పందన తెలియజేశారు. స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డుకు తిరుపతి (Tirupati) నగరం ఎంపిక కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ అవార్డును తిరుపతి నగర ప్రజలకు అంకితం ఇస్తున్నామని ప్రకటించారు. నాతోటి కార్పొరేటర్లు , కమిషనర్ నాయకత్వంలో అధికారులు, సిబ్బంది చేసిన కృషి ఫలితమే ఈ అవార్డు అని పేర్కొన్నారు. ఈ ప్రయత్నంలో తిరుపతి నగర ప్రజలు అందించిన సహకారం మరువలేను అన్నారు.
రాజకీయాలతో సంబంధం లేని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చానని, ఇవాళ దేశ అత్యున్నత మైన పదవిలో ఉన్న రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇది జీవితంలో మరిచి పోలేనని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి మహిళలకు , బలహీన వర్గాల వారికి రాజకీయాలలో ఇచ్చిన ప్రాదాన్యత, మాజీ శాసన సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి నన్ను మేయర్ గా చేయడంతోనే సాధ్యమైందన్నారు.
పవిత్ర పుణ్యక్షేత్రం శ్రీవారి పాదాల చెంత నెలకొన్న తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడం మన అందరి బాధ్యత అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఈ ప్రోత్సాహంతో మరింత పట్టుదలతో తిరుపతి నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు కృషి చేస్తామన్నారు.
Also Read : AP CM Chandrababu Important Visit : సీఎం చంద్రబాబు 2 రోజుల ఢిల్లీ పర్యటనలో కీలక అంశాలు ఇవే!
















