హైదరాబాద్ : ఎన్టీవీ ఇన్ పుట్ ఎడిటర్ దొంతు రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు తన అరెస్ట్ కు సంబంధించి. సంబంధం లేని ఒక వార్తా కథనానికి, నాకు లెంక పెట్టారని వాపోయారు. దావోస్ లో జరగనున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్లో తెలంగాణా రాష్ట్ర భాగస్వామ్య వార్తల కవరేజీ కోసం అలాగే వెకేషన్ ట్రిప్ కోసం వయా బ్యాంకాక్ మీదుగా నా భార్యతో స్విట్జర్లాండ్ కు వెళ్తున్న సమయంలో తనను అకారణంగా తెలంగాణ పోలీసులు శంషాబాద్ ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారని ఆరోపించారు దొంతు రహేష్. అరెస్ట్ చేసినప్పటి నుంచి విచారణ పేరిట వేధింపులకు గురి చేశారని వాపోయారు.
నాకు ఏమాత్రం సంబంధం లేని అనేక ప్రశ్నలతో గంటల తరబడి వేధించిన విషయం కూడా విదితమే. ఐతే, పోలీసులు నన్ను అక్రమంగా నిర్బంధించింది మొదలు, గౌరవ జడ్జి నా రిమాండ్ ను తిరస్కరించారని తెలిపారు. అర్ధరాత్రి దాటిన తరవాత విడుదల చేసే వరకు, కష్టకాలంలో అండగా ఉండి వ్యక్తిగతంగా నాకు , ఎన్టీవీ కి బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికీ పేరు పేరునా కృతఙ్ఞతలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు దొంతు రమేష్.
పండగ పూట చేయని తప్పుకు పాలకపక్షం పైశాచికానికి, అధికారగణం అణచివేతకు గురౌతున్న క్లిష సమయంలో, రాజకీయ పార్టీలు, పంథాలు, సిద్ధాంతాలకు అతీతంగా నా వెన్నంటి ఉన్న మిత్రులు, జర్నలిస్టు సోదరులు, రాజకీయ నేతలు, బీసీ సంఘాల నాయకులు, జర్నలిస్టు సంఘాల నాయకులు, వివిధ పత్రికలు, ఎలెక్ట్రానిక్ మీడియా యాజమాన్యాలు, సోషల్ మీడియా వారియర్స్ కు , నా ఎన్టీవీ కుటుంబానికి ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియ చేస్తున్నట్లు పేర్కొన్నారు.
