Donald Trump : అమెరికా – అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి నోరు పారేసుకున్నారు. తన వల్లనే పాకిస్తాన్, ఇండియా యుద్దం ఆగిందన్నారు. లేక పోతే ఇండియా చాలా నష్ట పోయి ఉండేదన్నారు. యుద్ధం సమయంలో ఏడు లేదా అంతకంటే ఎక్కువ యుద్ధ విమానాలు కూలి పోయాయని ట్రంప్ (Donald Trump) తన వాదనను పునరావృతం చేశారు . ఈ సంవత్సరం ప్రారంభంలో భారతదేశం, పాకిస్తాన్ మధ్య అణు ఘర్షణను నివారించడంలో తాను ప్రత్యక్ష పాత్ర పోషించానని చెప్పారు. తాను స్వయంగా పీఎం నరేంద్ర మోదీతో మాట్లాడానని అన్నారు. చివరకు తను సీరియస్ గా వార్నింగ్ ఇవ్వడంతో దిగి వచ్చాడని పేర్కొన్నారు.
Donald Trump Shocking Comments
నిరంతర శత్రుత్వం వాణిజ్య ఒప్పందాలను అడ్డు కుంటుందని పాకిస్తాన్‌ను హెచ్చరించానని చెప్పారు. వైట్ హౌస్‌లో జరిగిన క్యాబినెట్ సమావేశంలో ప్రసంగించారు ట్రంప్. వాణిజ్య పరంగా ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించానని పేర్కొన్నారు. ఇదే సమయంలో అణు యుద్దం గనుక మొదలైతే ఇరు దేశాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని హెచ్చరించానని అన్నారు. గత్యంతరం లేక అటు పాకిస్తాన్ ఇటు ఇండియా కాళ్ల బేరానికి వచ్చాయమన్నారు డొనాల్డ్ ట్రంప్. మీరు గనుక మాట వినక పోతే మీపై భారీ ఎత్తున సుంకాలు విధించడం జరుగుతుందని చెప్పానన్నారు. 5 గంటలలో యుద్దం ముగిసిందని, తాను గనుక జోక్యం చేసుకోక పోతే పరిస్తితి దారుణంగా ఉండేదన్నారు.
Also Read : New US Tarrifs Sensational : భారత్‌పై అమెరికా 50% సుంకాలు అమల్లోకి


















