Donald Trump : అమెరికా : అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మరోసారి బిగ్ షాక్ ఇచ్చారు. మరోసారి ఆయన ఇండియాపై నోరు పారేసుకున్నారు. ఇప్పటికే 100 శాతం టారిఫ్ విధించిన ట్రంప్ ఉన్నట్టుండి రష్యా నుంచి గనుక ఆయిల్ కొనుగోలు చేస్తే ఇంకోసారి సుంకాలు విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు. తక్షణమే ఆయిల్ కొనుగోలు చేయడం మానుకోవాలని సూచించారు. మాస్కో నుండి చమురు కొనుగోళ్లను నిలిపి వేస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నుండి తనకు హామీ లభించిందని ట్రంప్ చెప్పారు. ఎయిర్ ఫోర్స్ వన్‌లో మీడియాతో మాట్లాడారు. భారతదేశం గనుక తమ మాట వినకుండా రష్యా నుండి చమురు కొనుగోలును నిలిపి వేయాలని, లేక పోతే భారీ సుంకాల మోత తప్పదని వార్నింగ్ ఇచ్చారు.
Donald Trump Shocking Comments on Russian Oil Purchase
ట్రంప్ ప్రకటన రష్యా నుండి చమురు కొనుగోళ్లపై భారతదేశం ఇటీవల చేసిన వ్యాఖ్యల గురించి అడిగిన ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇచ్చారు. ట్రంప్ రష్యా ముడి చమురు సేకరణను నిలిపి వేస్తుందని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ పేర్కొన్న కొన్ని గంటల తర్వాత, మార్కెట్ పరిస్థితులకు అనుగుణంగా తన ఇంధన వనరులను విస్తృతంగా , వైవిధ్య భరితంగా మారుస్తున్నట్లు భారతదేశం గత వారం తెలిపింది. భారతదేశం అలాంటి వ్యాఖ్యలు చేసిందని తాను నమ్మడం లేదని ట్రంప్ అన్నారు. తాను ప్రధాని మోదీతో మాట్లాడానని, చమురును కొనుగోలు చేయడం లేదని స్పష్టం చేశారన్నారు.
Also Read : YS Jagan Fired on AP Govt : హామీల అమలులో ఏపీ కూటమి వైఫల్యం



















