Donald Trump Shocking Comments : ఆయిల్ కొనుగోలు చేసే దేశాల‌పై సుంకాలు విధించాలి

అమెరికా దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కీల‌క ప్ర‌క‌ట‌న

Hello Telugu - Donald Trump Shocking Comments

Hello Telugu - Donald Trump Shocking Comments

Donald Trump : అమెరికా : అమెరికా మ‌రోసారి రెచ్చి పోయింది. కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. టారిఫ్స్ జ‌పం చేస్తోంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించాలని జీ7 దేశాలను అమెరికా కోరింది . యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ , యునైటెడ్ కింగ్ డ‌మ్ ల‌తో కూడిన కూట‌మి దేశాల‌కు కీల‌క సూచ‌న‌లు చేసింది. మాస్కో యుద్ధ యంత్రానికి నిధులు ఆయా దేశాలు ఆయిల్ ను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల‌నే వ‌స్తున్నాయ‌ని పేర్కొంది యుఎస్ఏ. ఇదిలా ఉండ‌గా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్, యునైటెడ్ స్టేట్స్ వాణిజ్య ప్రతినిధి రాయబారి జామిసన్ గ్రీర్ జి7 ఆర్థిక మంత్రుల‌తో ఫోన్ లో మాట్లాడారు.

Donald Trump Shocking Comments on Tariffs

రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడం గురించి బ్లాక్ భాగస్వాములకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) చేసిన పిలుపును పునరుద్ఘాటించారు. ఉక్రెయిన్‌పై రష్యా తన యుద్ధాన్ని ముగించడానికి ఒత్తిడి పెంచడానికి మరిన్ని చర్యలను చర్చించడానికి ఆర్థిక మంత్రుల సమావేశానికి కెనడా ఆర్థిక, జాతీయ రెవెన్యూ మంత్రి ఫ్రాంకోయిస్-ఫిలిప్ షాంపైన్ అధ్యక్షత వహించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించడానికి నిజంగా కట్టుబడి ఉంటే రష్యా నుండి చమురు కొనుగోలు చేసే దేశాలపై సుంకాలు విధించడంలో వారు యునైటెడ్ స్టేట్స్‌తో చేరాలి పిలుపు ఇచ్చారు. ఇదిలా ఉండ‌గా ర‌ష్యాతో ఎక్కువ‌గా ఆయిల్ ను తీసుకుంటున్న దేశాల‌లో ఇండియాతో పాటు చైనా కూడా ఉంది.

Also Read : China Improve Bone Glue : 3 నిమిషాల్లో విరిగిన ఎముకను అతికించే టెక్నాలజీ కనుగొన్న చైనా

Exit mobile version