Donald Trump : అమెరికా : ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనది నోబెల్ బహుమతి. దీనిపై ఈసారి ఫుల్ ఫోకస్ పెట్టారు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. తాజాగా సంచలన కామెంట్స్ చేశారు. నోబెల్ బహుమతి గెలవక పోవడం అంటే అమెరికా దేశానికి పూర్తిగా అవమానం తప్పా మరోటి కాదన్నారు. తాను రెండవసారి అమెరికా చీఫ్ గా కొలువు తీరారు. తాను వచ్చాక ప్రపంచంలో ఏడు యుద్దాలు జరగకుండా నిలిపి వేశానని, దీనికంతటికి తానే కారణమని పేర్కొన్నారు. ఈ సందర్బంగా తనకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన చేసిన ప్రకటనకు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి పలు దేశాలు. వారిలో పాకిస్తాన్ బేషరతుగా సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపింది. ఇండియా కూడా మద్దతు ఇవ్వాలని కోరారు ట్రంప్ (Donald Trump). కానీ మోదీ సర్కార్ ఒప్పుకోలేదు. భారత దేశంపై ఆయన అవాకులు చెవాకులు పేలారు. తన వల్లనే ఇండియా, పాకిస్తాన్ మధ్య యుద్దం ఆగి పోయిందంటూ బహిరంగంగానే ప్రకటించారు. దీనిపై తీవ్ర అభ్యంతరం తెలిపింది ఇండియా.
Donald Trump Shocking Comments on Nobel Price
ఇదిలా ఉండగా అక్టోబర్ 10న నోబెల్ శాంతి బహుమతిని ప్రకటించనుంది జ్యూరీ కమిటీ. దీంతో మరోసారి తన వాయిస్ పెంచారు డొనాల్డ్ ట్రంప్. తనకు శాంతి బహుమతి ఇవ్వాల్సిందేనని, అలా ఇవ్వక పోతే యావత్ అమెరికా దేశానికి తీరని అవమానమని పేర్కొన్నారు. గాజాపై యుద్దం జరగకుండా ఆపానని అన్నారు. నోబెల్ బహుమతి మీకు వస్తుందని అనుకుంటున్నారా అన్న మీడియా ప్రశ్నలకు సీరియస్ గా స్పందించారు అమెరికా చీఫ్. అయితే తనకు ప్రకటించేందుకు వారికి తీవ్ర అభ్యంతరాలు ఉంటాయని, ఏమీ చేయని వ్యక్తులకే నోబెల్ శాంతి బహుమతి ఇస్తారంటూ సంచలన ఆరోపణలు చేశారు ట్రంప్. నోబెల్ బహుమతి నాకు కాదు అమెరికాకు రావాల్సి ఉందన్నారు.
Also Read : BCCI Files Complaint on Naqvi Shocking : ఆసియా క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ పై బీసీసీఐ ఫిర్యాదు


















