విశాఖపట్నం: శెట్టి బలిజల దైవం దొమ్మేటి వెంకటరెడ్డి అని కొనియాడారు మంత్రి నారా లోకేష్. శెట్టి బలిజ సంక్షేమ సంఘం ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారు. శెట్టిబలిజల్లో చైతన్యం తీసుకొచ్చి హక్కుల సాధన కోసం ఉద్యమించారని కొనియాడారు. విశాఖపట్నం తెలుగుదేశం కార్యాలయంలో దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నారా లోకేష్ మాట్లాడారు. శెట్టి బలిజల ఆత్మగౌరవం దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాను. జయంతిని ఈరోజు రాష్ట్ర పండుగగా జరుపు కుంటున్నాం. దొమ్మేటి వెంకటరెడ్డి జీవితం మనకు ఆదర్శం. బ్రిటిష్ పాలనలో శెట్టిబలిజలు బర్మా వలస వెళ్లారు. వారిలో దొమ్మెటి వెంకట రెడ్డి కూడా ఉన్నారు. షిప్స్ అద్దెకు తీసుకొని షిప్పింగ్ బిజినెస్ స్టార్ట్ చేశారు.
సమర్ధవంతంగా వ్యాపారం చేసి షిప్స్‌కు ఓనర్ అయ్యారు. తర్వాత బర్మాకు మేయర్‌గా పనిచేశారు. శెట్టిబలిజలు బర్మాలో పడుతున్న బాధలు నేరుగా చూశారు. విద్య విలువ అప్పట్లోనే తెలుసుకొని పిల్లల కోసం స్కూళ్లు పెట్టారు. నైట్ స్కూళ్లు ఏర్పాటు చేశారు. బర్మాలో శెట్టిబలిజ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశారు. అక్కడ ఆర్థికంగా బలపడిన తర్వాత జన్మభూమికి సేవ చేయాలని నిర్ణయించుకుని జన్మభూమికి వచ్చారు. బోడసకుర్రు జమీందార్‌గా అనేక దానధర్మాలు చేశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారు. స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటు కోసం దొమ్మేటి వెంకట రెడ్డి తన సొంత భూమిని దానం చేశారు. లైబ్రరీలు స్టార్ట్ చేయడానికి నిధులు ఇచ్చారని అన్నారు.

















