సీఎం చేతిలో కీలు బొమ్మ‌లుగా మార‌కండి

ఖాకీల‌కు సూచించిన ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్

hellotelugu-DasojuSravanKumar

హైద‌రాబాద్ : ఎమ్మెల్సీ దాసోజు శ్ర‌వ‌ణ్ నిప్పులు చెరిగారు. రాష్ట్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న తీరు ప‌ట్ల ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇది మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు. పాల‌న గాడి త‌ప్పింద‌న్నారు. పూర్తిగా రాచ‌రిక పాల‌న‌ను తల‌పించేలా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్య‌వ‌హ‌రిస్తున్నాడ‌ని ఆరోపించారు. ఒక సీఎం స్థాయికి త‌గ‌ని విధంగా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్ర‌జ‌లు అన్నీ గ‌మ‌నిస్తున్నార‌ని, ఒక విష‌యం మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాల‌ని హిత‌వు ప‌లికారు. ఒకప్పుడు పోలీసులు రేవంత్ రెడ్డికి నోటీసులు ఇవ్వడానికి వస్తే రౌడీ లాగా బైటకి వచ్చి ఎవడ్రా నన్ను అరెస్ట్ చేసేది ముడ్డి మీద తంతా అని అన్నాడని ఇప్పుడు ఎందుకు త‌న‌పై కేసు న‌మోదు చేయ‌డం లేద‌ని ప్ర‌శ్నించారు.

కేవ‌లం బీఆర్ఎస్ నాయ‌కుల‌ను ల‌క్ష్యంగా చేసుకుని నిరాధార‌మైన ఆరోప‌ణ‌లు చేసిన వాటిని ఆధారంగా చేసుకుని కేసులు న‌మోదు చేయ‌డం ఎంత వ‌ర‌కు స‌బ‌బు అని ప్ర‌శ్నించారు దాసోజు శ్ర‌వ‌ణ్ కుమార్ ఆచారి. అలా ముడ్డి మీద తంతా అన్నందుకే కేసు పెట్టి లోపల వెయ్యొచ్చు.. కానీ అలా చేయలేదు ఎందుక‌ని అని ఆన్నారు. ఇవాళ హరీష్ రావు, కేటీఆర్ ల‌కు నోటీసులు ఇస్తే చట్టాన్ని, పోలీసులను గౌరవించి మీ ఎదురుగా గంటలు తరబడి కూర్చుంటున్న విషయాన్ని గుర్తించాల‌ని అన్నారు . పోలీసులు కాంగ్రెస్ పార్టీకి, ముఖ్య‌మంత్రి ఎ. రేవంత్ రెడ్డికి తొత్తులుగా మార వ‌ద్ద‌ని సూచించారు. రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలుగా మారకండి అని హిత‌వు ప‌లికారు.

Exit mobile version