DK Suresh : ఢిల్లీ : కాంగ్రెస్ మాజీ ఎంపీ డీకే సురేష్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన ఎవరో కాదు ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ (DK Suresh) కు స్వయాన సోదరుడు. తనకు కావాల్సిన వ్యక్తి. డీకేఎస్ తో ఏ పని కావాలన్నా సురేష్ ను కలిస్తే అయి పోతుందన్న టాక్ కూడా ఉంది. ఈ తరుణంలో ఆయన శనివారం ఢిల్లీలో ప్రత్యక్షం అయ్యారు. ఈ సందర్బంగా తనను కలిసిన మీడియాతో మాట్లాడారు. భారతీయ జనతా పార్టీని ఏకి పారేశారు డీకే సురేష్. తాను ఏ రాజకీయ అంశం గురించి వ్యాఖ్యానించాలని అనుకోవడం లేదన్నారు డీకే సురేష్. ఏవైనా సమస్యలు ఉన్నా, కర్ణాటక ప్రభుత్వం, సీఎం సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
DK Suresh Shocking Comments
ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ ప్రతిపక్షంలో ఉందన్నారు డీకే సురేష్. అది ఎల్లప్పుడూ వేరే విషయాలు చెబుతుందని ఆరోపించారు. వాళ్లకు తాము తప్పా ఇతర పార్టీలు ఉండ కూడదని అనుకుంటుందన్నారు. ఇలాంటి చిల్లర వేషాలు, రాజకీయాలు తమ వద్ద వర్కవుట్ కావన్నారు డీకే సురేష్ సీరియస్ గా. విచిత్రం ఏమిటంటే నిత్యం వార్తల్లో బీజేపీ ఉండాలని అనుకుంటుందని పేర్కొన్నారు. వాళ్లకు పని లేకుండా పోయింది. ఏం చేయాలో తోచడం లేదని, అందుకే తమను టార్గెట్ గా తీసుకుని నిరాధారమైన ప్రచారానికి తెర లేపారంటూ ఫైర్ అయ్యారు మాజీ ఎంపీ. ప్రస్తుతం రాష్ట్రంలో తమ సర్కార్ కూల్ గా తన పని తాను చేసుకుంటూ పోతోందని చెప్పారు. ఎవరూ కూడా ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు డీకే సురేష్.
Also Read : AP Heavy Rains Update Sensational : తుపాను ప్రమాదం జర భద్రం
