DK Shivakumar : కర్ణాటక : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ (DK Shivakumar) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీఎంతో కలిసి మీడియాతో మాట్లాడినా ఆయన ఇంకా తన మనసులోని మాటలను వెనక్కి తీసుకోక పోవడం ఒకింత ప్రాధాన్యత ఏర్పడింది. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి తాము కట్టుబడి ఉంటామని ప్రకటించారు. ఇదే సమయంలో తనకు స్నేహితుడు, వేరే పార్టీకి చెందిన నాయకుడు ఆలయాన్ని సందర్శించాలని కోరాడని చెప్పారు. మొత్తంగా ఆయన మిశ్రమ సంకేతాలను హైకమాండ్ కు పంపించడం చర్చకు దారి తీసేలా చేసింది. తాను తీహార్ జైలులో ఉన్నప్పుడు, నా అత్త మామలు ఈ ఆలయానికి నాలుగుసార్లు వచ్చారని తెలిపారు. ఈ ఆలయం అత్యంత పవిత్రతో కూడి ఉన్నదని వారి నమ్మకం. దీంతో గత రెండు సంవత్సరాలుగా, వేరే పార్టీకి చెందిన ఒక స్నేహితుడు నన్ను ఇక్కడికి సందర్శించమని చెబుతూ వచ్చాడన్నారు.
DY CM DK Shivakumar Shocking Comments on CM Position
నేను ఇక్కడికి వచ్చినప్పుడు, నాకు ఒక మహిమ కలిగిన అనుభూతి కలిగిందని చెప్పారు డీకే శివకుమార్. ఈ అద్భుతమైన, చారిత్రాత్మక ఆలయంగా పేరు పొందిందన్నారు. అన్ని మతాల వారు ఈ ఆలయానికి వచ్చి ప్రార్థనలు చేస్తారని అన్నారు. దీనిని చూసి నేను సంతోషంగా ఉన్నాను. విగ్రహం చాలా అందంగా ఉంది. ఈ ఆలయాన్ని నిర్మించడానికి పనిచేస్తున్న వారు ముస్లింలు. ఈ ఆలయంలో కులం లేదా మతం లేదన్నారు డిప్యూటీ సీఎం. ఈ రోజు ఈ ఆలయానికి రావడానికి కారణం దేవుని ప్రేరణ తప్ప మరోటి కాదన్నారు. నేను రాష్ట్ర సంక్షేమం కోసం ప్రార్థించానని తెలిపారు. ఈ ఉదయం ఆలయ సందర్శన షెడ్యూల్ చేయబడింది. నేను ఏదైనా తీసుకు రావాలా అని పూజారిని అడిగానని అన్నారు. నాకు ఉన్నత పదవి రావాలని ఆయన ‘హోమం’ చేశారో లేదో నాకు తెలియదన్నారు.
Also Read : Harish Rao Fired on DY CM Bhatti : భట్టి విక్రమార్కకు శాఖలపై పట్టులేదు


















