DK Shivakumar Shocking Update : సీఎం ప‌ద‌వి ఇవ్వాలా వ‌ద్దా అనేది పార్టీ నిర్ణ‌యం

సంచ‌ల‌న కామెంట్స్ చేసిన డిప్యూటీ సీఎం డీకేఎస్

Hello Telugu - DK Shivakumar Shocking Update

Hello Telugu - DK Shivakumar Shocking Update

DK Shivakumar : బెంగ‌ళూరు : రోజు రోజుకు క‌ర్ణాట‌క రాజ‌కీయం మ‌రింత వేడిని రాజేస్తోంది. ఎవ‌రు సీఎం అవుతార‌నే దానిపై చ‌ర్చ కొన‌సాగుతోంది. సీఎంగా సిద్ద‌రామ‌య్య కొన‌సాగుతుండ‌గా త‌న టెర్మ్ పూర్త‌యింద‌ని, త‌న‌కు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ (DK Shivakumar). ఆయ‌న అత్య‌ధిక ఓటు బ్యాంకు క‌లిగిన త‌న సామాజిక వ‌ర్గానికి చెందిన స్వామీజీని క‌లిశారు. ఆయ‌న నుంచి ఆశీర్వాదం పొందారు. ఈ సంద‌ర్బంగా కీల‌క చ‌ర్చ‌ల‌కు తెర లేపారు. ఈ చ‌ర్చ‌ల్లో ప్ర‌దానంగా డీకే శివ‌కుమార్ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని సాక్షాత్తు స్వామీజీ కోర‌వ‌డం, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ను డిమాండ్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. రాష్ట్ర రాజ‌కీయాల‌ను కుదిపేస్తోంది.

DY CM DK Shivakumar Key Update

ఎవ‌రు ఏమ‌న్నా క‌న్న‌డ నాట లింగాయ‌త్ సామాజిక వ‌ర్గానిదే ఆధిప‌త్యం. అక్క‌డ మ‌ఠాలు కీల‌క‌మైన పాత్ర పోషిస్తాయి. ఈ త‌రుణంలో స్వామీజీ బ‌హిరంగంగానే డీకే శివ‌కుమార్ కు ముఖ్య‌మంత్రి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టాల‌ని కోర‌వ‌డం విస్తు పోయేలా చేసింది. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క కాంగ్రెస్ పార్టీలో రెండు వ‌ర్గాలుగా ఏర్ప‌డ్డాయి. ఓ వ‌ర్గానికి సీఎం సిద్ద‌రామ‌య్య ప్రాతినిధ్యం వ‌హిస్తుండ‌గా మ‌రో వ‌ర్గానికి డిప్యూటీ సీఎం డీకే శివ‌కుమార్ నేతృత్వం వహిస్తున్నారు. ఈ ఇద్ద‌రిలో ఇప్ప‌టి వ‌ర‌కు రెండున్నర ఏళ్ల పాటు సిద్ద‌రామ‌య్య పాల‌నా కాలం పూర్త‌యింది. కాగా మ‌రో రెండున్న‌ర ఏళ్ల పాటు తనకు ఛాన్స్ ఇవ్వాల‌ని కోరుతున్నారు డిప్యూటీ సీఎం. ఈ మొత్తం వ్య‌వ‌హారంపై డీకే శివ‌కుమార్ స్పందించారు. ఎవ‌రు ఉండాల‌నేది తాను నిర్ణ‌యించ‌న‌ని, పార్టీ హైక‌మాండ్ చూసుకుంటుంద‌న్నారు.

Also Read : Kavitha Strong Demand : బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వాల్సిందే

Exit mobile version