DK Shivakumar : బెంగళూరు : కర్ణాటకలో నవంబర్ విప్లవం మళ్లీ మొదలు కానుందా. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో పాటు ప్రతిపక్ష భారతీయ జనతా పార్టీకి చెందిన శాసన సభ ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక బాంబు పేల్చారు. నవంబర్ సంక్షోభం రానుందని జోష్యం చెప్పారు. రాష్ట్రంలో తప్పకుండా సీఎం మార్పు ఉంటుందన్నారు. దీనిపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న డీకే శివకుమార్ (DK Shivakumar). ఆయన దీనిపై స్పందించేందుకు ఒప్పుకోలేదు. ఇదిలా ఉండగా బుధవారం బాంబు పేల్చారు తన స్వంత సోదరుడు, ఎంపీ డీకే సురేష్. తన సోదరుడు డీకే శివ కుమార్ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆయనకు అన్నీ అర్హతలు ఉన్నాయని స్పష్టం చేశారు. అయితే ఇది తన ఒక్కడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమేనని పేర్కొన్నారు.
DK Shivakumar Will Promote
పార్టీ హైకమాండ్ నిర్ణయమే తుది నిర్ణయమని, క్రియాశీల లాబీయింగ్ లేదని నొక్కి చెప్పారు. ఇక నవంబర్ సంక్షోభం నెలకొనడం ఖాయమని వస్తున్న ప్రచారాన్ని ఆయన తోసి పుచ్చారు. ఇవాళ డీకే సురేష్ మీడియాతో మాట్లాడారు. సీఎం సిద్దరామయ్యను మారుస్తున్నట్లు పెద్ద ఎత్తున జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని కొట్టి పారేశారు. అయితే పార్టీ చీఫ్ గా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని పవర్ లోకి తీసుకు వచ్చిన ఘనత తన సోదరుడు డీకే శివకుమార్ దేనని స్పష్టం చేశారు ఎంపీ డీకే సురేష్. నాకు దాని గురించి ఎటువంటి సమాచారం లేదన్నారు. నవంబర్ విప్లవం అంటే నా దృష్టిలో కన్నడ రాజ్యోత్సవం . రాష్ట్ర అవతరణ దినోత్సవం తప్పా మరోటి కాదన్నారు.
Also Read : KTR Fired on Congress Govt : హామీల జాతర అమలులో పాతర : కేటీఆర్
















