White House : అమెరికా : అమెరికాలో దీపావళి పండుగను ప్రవాస భారతీయులు ఘనంగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా వైట్ హౌస్ (White House) లో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్నారు. ఆయన సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇందులో ప్రముఖ ఇండియన్ అమెరికన్ వ్యాపార నాయకుల ప్రతినిధి బృందం కూడా పాల్గొంది. ఇది అమెరికా, ఎన్నారైల మధ్య ఉన్న బంధాన్ని మరోసారి స్పష్టం చేసింది. ఇదిలా ఉండగా ఓవల్ కార్యాలయంలో భారతీయ అమెరికన్ నాయకులతో దీపావళి వేడుకలలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు ట్రంప్. భారతీయ-అమెరికన్లకు తన హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
White House Diwali Celebrations
భారత దేశ ప్రధానమంత్రిని ప్రశంసలతో ముంచెత్తారు ట్రంప్. తను గొప్ప వ్యక్తి అని, అంతకు మించి తనకు మంచి స్నేహితుడని పేర్కొన్నారు. ఇదే సమయంలో వాణిజ్యం, ప్రాంతీయ శాంతిలో అమెరికా , ఇండియా సంబంధాలను హైలెట్ చేశారు. భారత ప్రజలకు మా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియ జేస్తున్నాను. నేను ఈరోజే మీ ప్రధానమంత్రితో మాట్లాడాను. గొప్ప సంభాషణ జరిగింది. మేము వాణిజ్యం గురించి మాట్లాడుకున్నామని చెప్పారు ట్రంప్. దీపావళి పండుగ చీకటి వెలుగుల సమ్మేళనం. ఇది మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రాబోయే రోజుల్లో కూడా భారత్, అమెరికా దేశాల మధ్య బంధం మరంత బలంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు తెలిపారు ట్రంప్.
Also Read : Trump-Modi Important Trade Discussions : వాణిజ్యంపై మోదీతో ట్రంప్ చర్చలు


















