Mallikarjun Kharge : హైదరాబాద్ – పార్టీలో కొత్త పాత అనే తేడా లేకుండా ముందుకు వెళ్లాలని, అంత కంటే ముందు క్రమశిక్షణ ముఖ్యమన్నారు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge). సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం అవుతుందన్నారు. శుక్రవారం హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో జరిగిన టీపిసిసి విస్తృత స్థాయి సమావేశం రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది . ఈకీలక సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఖర్గే.
Mallikarjun Kharge Orders
సామాజిక న్యాయానికి కట్టుబడి కాంగ్రెస్ పార్టీ అగ్రవర్ణానికి చెందిన రేవంత్ రెడ్డిని సీఎం చేసిందన్నారు. పీసీసీ చీఫ్ బీసీకి, నలుగురు దళితులకు కేబినెట్ లో చోటు దక్కేలా చేసిందన్నారు. మరో దళిత బిడ్డను స్పీకర్ పదవి గౌరవించి ఇచ్చిందన్నారు. కొత్తగా నియమితులైన మీ అందరికి పార్టీ చక్కని అవకాశం కల్పించిందని, సద్వినియోగం చేసుకోవల్సిన బాధ్యత మీ అందరిపై ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు..అభివృద్ది తో పార్టీ మరోసారి 90 సీట్లతో అధికారంలోకి రావాలని పిలుపునిచ్చారు.
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయ సమర భేరి సభ నిర్వహించాలన్నారు. గ్రామాలకు వెళ్లి క్షేత్ర స్థాయిలో పర్యటించి సమన్వయంతో పని చేయాలన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. దేశంలోనే అన్ని రాష్ట్రాలకు తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలుస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి జనగణనలో కుల గణన చేసేలా చేయడంలో మనం విజయం సాధించామన్నారు.
తాను పీసీసీగా ఉన్న సమయంలో 45 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేయించానని చెప్పారు రేవంత్ రెడ్డి. యూత్ కాంగ్రెస్, NSUI, పార్టీ జిల్లా అధ్యక్షుల్లో చాలా మందికి మన ప్రభుత్వంలో పదవులు వరించాయన్నారు.
Also Read : TPCC Chief Strong Warning : ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై పీసీసీ సీరియస్
















