YS Jagan: తాడేపల్లి గూడెం : ఏపీ కూటమి సర్కార్ నుంచి తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, శ్రేయోభిలాషులపై దాడుల నుంచి రక్షించేందుకు గాను కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan) తమ పార్టీ వేదికగా డిజిటల్ బుక్ ను ఆవిష్కరించారు. ఇందుకు సంబంధించి ఎవరైనా ఎప్పుడైనా సరే తమ వివరాలు నమోదు చేయొచ్చని తెలిపారు ఈ సందర్బంగా . ఇదిలా ఉండగా https://digitalbook.weysrcp.com/auth/phoneలో ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందన్నారు. దీని ద్వారా ఎవరైనా తాము ఎదుర్కొన్న అన్యాయానికి సంబంధించిన వివరాలను నేరుగా అప్‌లోడ్ చేయవచ్చని స్పష్టం చేశారు జగన్ మోహన్ రెడ్డి. ప్రతి సంఘటనను శాశ్వత డిజిటల్ డైరీలో నమోదు చేసి భద్ర పరుస్తారని తెలిపారు. అంతే కాకుండా 040-49171718 ద్వారా ఐవీఆర్ఎస్ కాల్ సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు మాజీ సీఎం.
YS Jagan New Digital Book
దీని ద్వారా కార్మికులు, బాధితులు ఫోన్ ద్వారా తమ ఫిర్యాదులను నమోదు చేసుకునే వీలు కలుగుతుందన్నారు . ఈ రికార్డులు కేవలం ప్రతీకాత్మకమైనవి కావు అన్నారు, కానీ ఖచ్చితమైన చర్యకు ఆధారం అవుతాయని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ప్రత్యేక దర్యాప్తు బృందం ప్రతి డాక్యుమెంట్ సంఘటనను పరిశీలిస్తుందని పేర్కొన్నారు. ఎవరైనా పదవీ విరమణ చేసినా, రాష్ట్రం నుండి బయటకు వెళ్లినా, లేదా విదేశాలలో నివసిస్తున్నా, తాము ప్రతి కేసును కొనసాగిస్తామన్నారు. దోషులను చట్టం ముందు నిలబెట్టి, బాధితులకు న్యాయం చేస్తామన్నారు.
Also Read : Tirupati GST Officer Suspension Sensational : సర్కార్ నిర్ణయంపై సర్వత్రా ఆగ్రహం
















