21 రోజుల్లో రూ. 1000 కోట్ల క్ల‌బ్ లోకి ధురంధ‌ర్

అతి త‌క్కువ కాలంలోనే వ‌సూళ్ల వేట

hellotelugu-Dhurandhar

ముంబై : భార‌తీయ సినీ ప‌రిశ్ర‌మ‌లో దుమ్ము రేపుతోంది ఆదిత్య ధ‌ర్ ద‌ర్శ‌క‌త్వం వహించిన మూవీ ధురంధ‌ర్ సినిమా. కేవ‌లం 10 రోజుల్లోనే ఈ చిత్రం ఆశ్చ‌ర్య పోయేలా రూ. 500 కోట్లు వ‌సూలు చేసింది. తాజాగా మ‌రో కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. ధురంధ‌ర్ రూ. 1000 కోట్ల క్ల‌బ్ లోకి చేరుకుంది. ఈ మూవీతో పాటు ప‌లు మూవీస్ ఈ మార్క్ ను దాటిన‌వి ఉండ‌డం విశేషం. ఇక‌ రణవీర్ సింగ్ నటించిన ఈ స్పై-యాక్షన్ థ్రిల్లర్ 21 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటింది. పదునైన యాక్షన్ సన్నివేశాలు, బహుళ పొరల కథనం, బలమైన ప్రధాన నటనతో, ధురంధర్ వివిధ ప్రాంతాల ప్రేక్షకులను, విదేశీ మార్కెట్లను ఆకట్టు కోగలిగింది.

ఇక వెయ్యి కోట్లు సాధించిన మూవీస్ ప‌రంగా చూస్తే ఇలా ఉన్నాయి. డైన‌మిక్ ద‌ర్శ‌కుడు సుకుమార్ అల్లు అర్జున్ , ర‌శ్మిక మంద‌న్నాతో క‌లిసి తీసిన పుష్ప -2 టాప్ లో కొన‌సాగింది. ఈ చిత్రం కేవలం 7 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ. 1000 కోట్ల మార్కును దాటి, ఈ ఘనత సాధించిన అత్యంత వేగవంతమైన భారతీయ చిత్రంగా నిలిచింది. సాక్ నిల్క్ రిపోర్టు ప్ర‌కారం వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1742. 1 కోట్లు వ‌సూలు చేసింది. మ‌రో చిత్రం ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి తీసిన బాహు బ‌లి . ఇది 2017లో వ‌చ్చింది. 10 రోజుల్లో వెయ్యి కోట్లు సాధించింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1788.06 కోఓట్లు వ‌సూలు చేసింది.

ఇక 2022లో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది ఆర్ఆర్ఆర్. దీనికి కూడా ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి. ఇందులో జూనియ‌ర్ ఎన్టీఆర్, రామ్ చ‌ర‌ణ్ తేజ క‌లిసి న‌టించారు. ఇది 16 రోజుల్లో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా రూ. 1230 కోట్లు సాధించింది. ఏకంగా ఆస్కార్ అవార్డును స్వంతం చేసుకుంది. పాన్ ఇండియా స్టార్ య‌శ్ కీ రోల్ పోషించిన చిత్రం కేజీఎఫ్ . దీనికి ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ మూవీ 2022లో వ‌చ్చింది. 18 రోజుల్లో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా ర‌. 1215 కోట్లు సాధించింది. త‌మిళ సినీ రంగానికి చెందిన డైన‌మిక్ స్టార్ డైరెక్ట‌ర్ అట్లీ తీసిన మూవీ జ‌వాన్. ఇది 2023లో వ‌చ్చింది. ఇందులో షారుక్ ఖాన్ న‌టించాడు. 18 రోజుల్లో రూ. 1000 కోట్లు వ‌సూలు చేసింది. వ‌ర‌ల్డ్ వైడ్ గా 1160 కోట్లు సాధించింది. ఆ త‌ర్వాత ఆదిత్య ధ‌ర్ తాజాగా తీసిన ధురంధ‌ర్ రికార్డ్ బ్రేక్ చేసింది. వ‌సూళ్ల వేట కొనసాగిస్తోంది.

 

https://www.youtube.com/watch?v=45y4YGxVInw

Exit mobile version