కేరళ : క్రికెటర్ సంజు శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈనెల 28 నుంచి ఐపీఎల్ ప్రారంభం కానుంది . ఈ సందర్బంగా తను రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఆడడం లేదు. తొలిసారిగా చెన్నై సూపర్ కింగ్స్ జట్టు తరపున ప్రాతినిధ్యం వహించనున్నాడు. జట్టు ప్రయోజనాల కోసం తాను ఆడతానని, వ్యక్తిగత రికార్డుల గురించి పట్టించుకోనని చెప్పాడు. ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటంటే అందరూ తనకు కెప్టెన్సీ దక్కుతుందని అంటున్నారు. ముందు నేను ఆడటంపైనే ఫోకస్ పెడతాను. మిగతా అంశాల గురించి పట్టించుకోను. ఫోన్ కు, సోషల్ మీడియాకు దూరంగా ఉంటానని చెప్పాడు సంజు శాంసన్.
ఇదే సమయంలో సీఎస్కే కు ఎనలేని విజయాలు కట్టబెట్టిన మహేంద్ర సింగ్ ధోనీ గురించి ప్రశంసలు కురిపించాడు. నేను ఇక్కడ కెప్టెన్సీ కోసం లేను. ఇక్కడ ఒకే ఒక్క అధిపతి ఉన్నారు, ఆయనే మహేంద్ర సింగ్ ధోని. నేను కేవలం సీఎస్కే కోసం మ్యాచ్‌లు గెలవాలని అనుకుంటున్నాను, ట్రోఫీని గెలవడమే నా ప్రధాన లక్ష్యం అని స్పష్టం చేశాడు సంజు శాంసన్. రాజస్థాన్ రాయల్స్‌తో నేను తలపడటం ఇదే మొదటిసారి కావచ్చు. కానీ మైదానంలో నేను భావోద్వేగాలకు లోనుకాను. ఆ జట్టులో నా సమయం ముగిసి పోయిందని భావించడం వల్లే నేను రాజస్థాన్ రాయల్స్‌ను వీడాను. ఇప్పుడు మేము వారితో తలపడినా సరే, నేను నా అత్యుత్తమ ఆటనే ప్రదర్శిస్తానని చెప్పాడు.


















