Dheekshith Shetty : బెంగళూరు : నటుడు దీక్షిత్ శెట్టి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తను తాజాగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నా లవ్, ఇతర అంశాలపై స్పందించాడు. ప్రధానంగా యువ నటుడు విజయ్ దేవరకొండతో జరిగిన ఎంగజ్ మెంట్ పై మాట్లాడాడు. ఇటీవల ‘ది గర్ల్‌ఫ్రెండ్’ చిత్రంలో రష్మిక మందన్న సరసన నటించాడు దీక్షిత్ శెట్టి (Dheekshith Shetty). ఈ సినిమాకు మంచి ఆదరణ లభించింది. నటించిన ఇద్దరికీ మంచి మార్కులు పడ్డాయి. ప్రధానంగా మహిళా కోణంలో తీసిన ఈ మూవీని మహిళలతో పాటు పురుషులు కూడా స్వాగతించారు. చర్చకు లేవనెత్తేలా తీయడంలో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సక్సెస్ అయ్యాడు. ఇదిల ఉండగా సక్సెస్ మీట్ సందర్బంగా నటుడు దీక్షిత్ శెట్టి మీడియా అడిగిన ప్రశ్నలకు కూల్ గా జవాబు ఇచ్చాడు.
Dheekshith Shetty Responds on Rashmika Mandanna Marriage
రష్మిక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. ఇతరుల వ్యక్తిగత విషయాల గురించి తాను అస్సలు పట్టించుకోనని స్పష్టం చేశాడు దీక్షిత్ శెట్టి. రష్మిక ప్రేమ, ఎంగేజ్‌మెంట్ విషయాల గురించి ఎప్పుడూ ఆమెతో చర్చించలేదని అన్నాడు. ఆ సందర్బం, సమయం తనకు రాలేదని చెప్పుకొచ్చాడు. సినిమా షూటింగ్ సమయంలో పాత్రలో ఎలా లీనం కావాలనే దానిపై మాత్రమే ఫోకస్ పెట్టామన్నాడు. అయినా ఒకరి వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడే హక్కు ఇంకొకరికి ఉండదని తన అభిప్రాయమని కుండ బద్దలు కొట్టాడు నటుడు. మొత్తంగా మనోడు చేసిన తాజా కామెంట్స్ మాత్రం కలకలం రేపుతున్నాయి.
Also Read : MLA Sanjay Shocking Comments : ఇండ్ల కోసం డబ్బులు అడిగితే దాడి చేయండి


















