K Kavitha : నిజామాబాద్ జిల్లా : తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు , ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతీయ జనతా పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. తనకు రాజకీయ పరంగా ఛాన్స్ ఇచ్చిన నిజామాబాద్ జిల్లా నుంచే తాను చేపట్టిన జాగృతి జనం బాట కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. బాధిత రైతులను పరామర్శించారు. ఈ సందర్బంగా యాత్రలో భాగంగా కల్వకుంట్ల కవిత (K Kavitha) మీడియాతో మాట్లాడారు. బీసీ బిల్లు ఆమోదం పొందాలంటే ఎంపీ అర్వవింద్ రాజీనామా చేయడంతో పాటు ఇతర ఎంపీలు కూడా తమ పదవులకు రిజైన్ చేయించాలని కోరారు . తెలంగాణకు చెందిన బీజేపీ ఎంపీలు రాజీనామా చేస్తే తప్పనిసరిగా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యం అవుతాయని చెప్పారు.
K Kavitha Strong Demand
ఇదిలా ఉండగా ఎంపీ అరవింద్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న తన అవినీతి, అక్రమాల గురించి వివరాలను త్వరలో బయట పెడతానని ప్రకటించారు. తాను ఎవరికీ తల వంచనని, ప్రతి ఒక్కరినీ వదిలి పెట్టే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం మానుకోవాలని సూచించారు. పనిగట్టుకుని తన వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇలాంటి చిల్లర మల్లర రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు కల్వకుంట్ల కవిత. బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కుమార్, గంగాపురం కిషన్ రెడ్డిలు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ ప్రశ్నించారు.
Also Read : Harish Rao Fired on Congress Govt : వడ్డెరలపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష తగదు

















