హైదరాబాద్ : సరదాగా మాట్లాడటంలో నటుడు ధనుష్ వెరీ స్పెషల్. తాజాగా తాను నటిస్తున్న ఓంలో కీ రోల్ పోషించాడు మమ్ముట్టి. ఈ మూవీ నవంబర్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ధనుష్‌తో పాటు మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మమ్ముట్టిని ఉద్దేశించి ధనుష్ చేసిన సరదా వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించడమే కాకుండా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి గురించి మాట్లాడుతూ ధనుష్ ఒక సరదా అభ్యర్థన చేశారు: మమ్ముట్టి సార్, నాకు ఒక చిన్న కోరిక ఉంది. వచ్చేసారి మీరు ఏదైనా ఈవెంట్‌కు వచ్చినప్పుడు, మీ గడ్డంలో కనీసం కొన్ని తెల్ల వెంట్రుకలు ఉండేలా చూసుకోండి. లేదంటే, మీ పక్కన నిలబడినప్పుడు నేను మీకంటే చాలా పెద్దవాడిలా కనిపిస్తున్నాను అని ధనుష్ చమత్కరించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యకు మమ్ముట్టితో పాటు అక్కడున్న ప్రేక్షకులందరూ నవ్వుల్లో మునిగి పోయారు. దీనికి నవ్వుతూ స్పందించిన మమ్ముట్టి తప్పకుండా అలానే చేస్తానని చెప్పారు.
ఓం చిత్రంలో సాయి పల్లవి పోలీస్ అధికారి పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు శ్రీలీల, నసీరుద్దీన్ షా, ఇంద్రన్స్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందించారు. వండర్‌బార్ ఫిలిమ్స్ , ఆర్-టేక్ స్టూడియోస్ బ్యానర్లపై ధనుష్, శ్రద్ధా అగర్వాల్ ,అజ్మత్ జగ్మాగ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది.


















