నంద్యాల జిల్లా : మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్బంగా శ్రీశైలం పుణ్య క్షేత్రానికి శివ భక్తులు పోటెత్తారు. శనివారం పాతాళ గంగ వద్ద ఏర్పాటు చేసిన బందోబస్తును పరిశీలించారు. మెట్ల మార్గం ద్వారా వెళ్లే భక్తులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. నదిలో బోటు నడిపే నిర్వాహకులు తప్పనిసరిగా భద్రత ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రయాణికులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్ వేసుకోవాలని అన్నారు ఎస్పీ. నిరంతరం అప్రమత్తంగా ఉంటూ విధులు నిర్వహించాలని సిబ్బందిని, అధికారులను ఆదేశించారు. పలు సూచనలు చేశారు ఎస్పీ. పుణ్య స్నానాలు ఆచరించే ప్రదేశం వరకు చేరుకున్న అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారులతో మాట్లాడారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నందున మెట్ల మార్గం ద్వారా భక్తులు జాగ్రత్తగా వెళ్లాలని పేర్కొన్నారు.
ఏర్పాటు చేసిన భద్రతా నిబంధనలు ఉల్లంఘించి ముందుకు వెళ్లరాదని మైక్ ద్వారా భక్తులను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. బోట్ల ద్వారా ప్రయాణికులను విహార యాత్రకు తీసుకువెళ్లే బోటు నిర్వాహకులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క ప్రయాణికుని భద్రత ,రక్షణ దృష్టిలో ఉంచుకోవాలని అన్నారు. లైఫ్ జాకెట్ వేసుకున్న తర్వాతనే ప్రయాణం చేసేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు ఎస్పీ సునీల్ షారాణ్.
