నంద్యాల జిల్లా : నంద్యాల జిల్లాలోని శ్రీశైలం పుణ్యక్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడుతోంది. ఏపీ, తెలంగాణ , కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు , తదితర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున శివ స్వాములు తరలి వస్తున్నారు. దీంతో శివాలయాలన్నీ భక్త బాంధవులతో నిండి పోతున్నాయి. ఈనెల 15న మహా శివరాత్రి పర్వదినం జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు చేశారు. శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు పోటెత్తారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. శ్రీశైలంలో ప్రశాంతంగా, సౌలభ్యంగా స్వామి వారిని దర్శించుకుంటున్నారని నంద్యాల జిల్లా కలెక్టర్, ఎస్పీలు తెలిపారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుండి ఇప్పటి వరకు 2 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారని చెప్పారు. ఇందులో లక్ష మందికి పైగా శివ స్వాములే ఉన్నారని పేర్కొన్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని కోరారు .
ప్రస్తుత పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకొని ప్రచారం చేయాలని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లాలోని శ్రీశైలం లో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో శ్రీ శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి వారిని దర్శించు కోవడానికి భక్తుల రద్దీ రోజు రోజుకి పెరుగుతూ ఉంది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దేవస్థానం వారు భక్తుల అవసరాల దృశ్య సౌకర్యాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఎస్పీ. అందుకు తగ్గట్టుగా పోలీసు శాఖ నుండి బందోబస్తు ఏర్పాట్లు చేశామన్నారు. కావున భక్తులు తొందర పడకుండా సంయమనం పాటిస్తూ పోలీసు వారి సూచనలను అనుసరిస్తూ దైవ దర్శనం చేసుకోవాలని జిల్లా ఎస్పీ కోరారు.



















