Deputy CM Pawan : అమరావతి : ప్రతి ఇంటికీ రక్షిత తాగునీరు అందించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan). జల్ జీవన్ మిషన్ పనులపై పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్తున్నామన్నారు. తొలిసారి గ్రామీణ తాగు నీటి సరఫరా విభాగం మొత్తం సిబ్బందికి శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. శాఖ అంతర్గత సామర్థ్యం పెంపు లక్ష్యంగా ప్రణాళికలు చేయాలన్నారు. నీటి శుద్ధి, నాణ్యత, సరఫరాకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ఏడాదిలో రూ. 7,910 కోట్ల జల్ జీవన్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు ప్రతి గ్రామానికి రక్షిత నీటి భద్రత అనే నినాదంతో ముందుకు వెళుతున్నామన్నారు.
Deputy CM Pawan Kalyan Key Update
ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ నేతృత్వంలో జల్ జీవన్ పనులు వేగవంతానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి గ్రామీణ కుటుంబానికీ కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించడం ద్వారా ప్రజలకు ఆరోగ్య భద్రత కల్పించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తున్నారు . నీటి నాణ్యత, శుద్ధి, సరఫరాలకు ప్రాధాన్యత ఇస్తూ మునుపెన్నడూ లేని విధంగా క్షేత్ర స్థాయిలో చిన్న ఉద్యోగి నుంచి రాష్ట్ర స్థాయిలోని ఉన్నత స్థాయి ఇంజినీర్ వరకు గ్రామీణ రక్షిత తాగునీటి సరఫరా విభాగం సిబ్బందిలో అంతర్గత సామర్థ్యాలు పెంచేలా శిక్షణ ఇస్తున్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యం జల్ జీవన్ మిషన్ లక్ష్యాలను దెబ్బ తీస్తే పవన్ కళ్యాణ్ కృషి, ప్రణాళికకు జల్ జీవన్ మిషన్ కు కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. గత ప్రభుత్వ ధోరణితో కారణంగా నిధులు మురిగిపోయే పరిస్థితి తలెత్తగా డిప్యూటీ సీఎం కృషితో కేంద్రం జల్ జీవన్ మిషన్ పథకం నిర్దేశిత గడువు నాలుగేళ్లపాటు పొడిగించింది.
Also Read : MP Gurumurthy Strong Demand : ఏర్పేడు రోడ్ ఓవర్ బ్రిడ్జ్ పనులు పూర్తి చేయాలి















