Deputy CM Pawan : అమరావతి – స్త్రీ పథకంతో రాష్ట్రంలోని మహిళలకు ఆర్థిక భరోసాతో పాటు భద్రత కలుగుతుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Deputy CM Pawan). దీని ద్వారా నెలకు రూ.1500 నుంచి రూ.2 వేలు పొదుపు చేసుకునే అవకాశం లభిస్తుందని చెప్పారు. రాష్ట్రానికి ఆర్థిక ఇబ్బందులున్నా హామీలను అమలు చేస్తున్నాం అన్నారు. ప్రజలు పెట్టుకున్న విశ్వాసాన్ని నిలబెట్టుకుంటాం అన్నారు. బస్సుల్లో సీసీ కెమెరాలు పెట్టి పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని చెప్పారు. జీరో ఫేర్ టిక్కెట్ తో రాష్ట్రమంతటా ఉచితంగా ప్రయాణం చేయొచ్చని దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మహిళలతో మాట్లాడుతున్నపుడు వారి కళ్లలో ఆనందం చూస్తున్నాం అన్నారు.
Deputy CM Pawan Kalyan Key Comments
ఉచిత బస్సు ప్రయాణం అంటే కేవలం రవాణా మాత్రమే కాదు.. వారి భద్రతకు తగిన విధంగా భరోసా ఇచ్చే గొప్ప పథకం అని, అందుకే ఈ పథకానికి స్త్రీ శక్తి పథకంగా పేరు పెట్టినట్లు ఉప ముఖ్యమంత్రి చెప్పారు. మహిళలు బస్సుల్లో ప్రయాణించే సమయంలో బస్సులో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు మహిళా కండక్టర్లకు పాకెట్ కెమెరాలను అమరుస్తామని పేర్కొన్నారు. దీని ద్వారా పూర్తి భద్రతతో మహిళలు ఉచిత ప్రయాణం రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేసే వీలు కలుగుతుందన్నారు. ఫ్రీ బస్సు పథకం అమలు సాధ్యమేనా అని తాను సీఎం చంద్రబాబుతో ప్రస్తావించానని, ఆయన దానికి కచ్చితంగా సాధ్యమేనని చెప్పారన్నారు. ఇవాళ తమ సర్కార్ మహిళల అభ్యున్నతి కోసం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
Also Read : Minister Atchannaidu – Free Bus : మహిళలకు వరం స్త్రీ శక్తి ఉచిత బస్సు పథకం

















